ETV Bharat / bharat

దిల్లీ యువతి మృతి కేసులో కీలక మలుపులు.. ప్లాన్​డ్​ మర్డర్​గా అనుమానాలు..!

దేశ రాజధాని దిల్లీలో జరిగిన కారు ప్రమాద ఘటనలో ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. అంజలి శవపరీక్ష నివేదికలో ఆమెకు 40 వరకు గాయాలైనట్లు తేలింది. అయితే మృతురాలి మిత్రురాలు నిధి చెప్పిన విషయాలకు.. శవపరీక్షలో వెల్లడైన నివేదికలతో పొంతన లేనందున.. మృతురాలు కుటుంబసభ్యులు ఇది పక్కా ప్లాన్డ్​ మర్డర్​గా అనుమానిస్తున్నారు.

Kanjhawala case
అంజలీ సింగ్​
author img

By

Published : Jan 4, 2023, 10:28 PM IST

దిల్లీలో యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అంజలి స్నేహితురాలు నిధి చెప్పిన వివరాలకు.. పోస్టుమార్టం నివేదికలకు పొంతన లేకపోవడం వల్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాద సమయంలో అంజలి మద్యం సేవించి ఉందన్న వార్తలను మృతురాలి తల్లి తోసిపుచ్చింది. అసలు తాము నిధిని ఎప్పడూ చూడలేదని తెలిపింది. అంజలిని ఉద్దేశపూర్వకంగానే హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు ఆరోపించారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్​ చేశారు. అరెస్ట్ చేసిన నిందితులను శిక్షించాలని తల్లి డిమాండ్ చేశారు.

"పోస్టుమార్టం నివేదికలో మద్యం ఆనవాళ్లు లేవని తెలిపారు. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్య. నిధి చెప్పిన మాటలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం సమయంలో ఇద్దరు కలిసి ఉన్నప్పుడు.. ఒకరు ఎటువంటి గాయాలు లేకుండా ఎలా తప్పించుకోగలిగారు?" " అని అంజలి కుటుంబసభ్యుడు భూపేంద్ర సింగ్​ చౌరాసియా ప్రశ్నించాడు. ఘటనపై విచారణ జరుగుతోందని, ప్రతి కోణంలోనూ పోలీసులు విశ్లేషిస్తున్నారని దిల్లీ పోలీసు స్పెషల్ సీపీ షాలినీ సింగ్ తెలిపారు.

Kanjhawala case
రేఖ, మృతురాలు తల్లి

"నాకు నిధి ఎవరో తెలియదు. నేను ఎప్పుడూ ఆమెను చూడలేదు. అంజలి ఎప్పుడూ మద్యం సేవించలేదు. ఆమె ఎప్పుడూ మత్తులో ఇంటికి రాలేదు. నిధి చేసిన వాదనలను మేము నమ్మము. నిధి అన్నీ తప్పుడు మాటలు చెబుతోంది. నిధి నా కూతురి స్నేహితురాలి అయితే అంజలిని ఒంటరిగా ఎలా వదిలేసింది?. ఇది బాగా ఆలోచించి చేసిన కుట్ర, ఇందులో నిధి ప్రమేయం ఉండవచ్చు. పూర్తి విచారణ జరగాలి."
-- రేఖ, మృతురాలు తల్లి

కీలకంగా సీసీటీవీ దృశ్యాలు..
తాజాగా వెల్లడైన సీసీటీవీ దృశ్యాలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. ఆ దృశ్యాలను బట్టి అంజలి స్నేహితురాలు ప్రమాద సమయంలో అక్కడ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఆమె ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందే ఇంటివద్దకు వచ్చినట్లు రికార్డులను బట్టి తెలుస్తోందని పోలీసులు అన్నారు.

పోస్టుమార్టం రిపోర్ట్​..
శవపరీక్షలో భయానక విషయాలు వెల్లడయ్యాయి. మృతురాలు అంజలి శరీరంపై దాదాపు 40 గాయాలు ఉన్నట్లు తెలిసింది. యువతి శరీరం కారు చక్రాల్లో చిక్కుకొని 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకోపోవడం వల్ల వెనకభాగం ఛిద్రమైంది. దాంతో పక్కటెముకలు కూడా బయటకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తలభాగం తీవ్రంగా దెబ్బతిందని పేర్కొన్నాయి. వెన్నెముక, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రమాదంతో షాక్‌కు గురవ్వడం, తీవ్ర రక్తస్రావం వల్లే యువతి మృతి చెందిందని నివేదిక పేర్కొంది. ఆరోపణలు వచ్చినట్లుగా ఆమెపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని పరీక్షలో తేలింది.

Kanjhawala case
కారును పరీక్షిస్తున్నట్లు ఫోరెన్సిక్ బృందం

ఫోరెన్సిక్ నివేదిక..
కారు ఈడ్చుకెళ్లడం వల్ల మరణించిన మహిళ మృతదేహం ఎడమ చక్రం కింద ఇరుక్కుపోయింది. వాహనం కింద భాగాలపై రక్తపు మరకలు కనిపించాయని ప్రాథమిక ఫోరెన్సిక్ పరిశోధనల్లో తేలింది. రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలోని నలుగురు సభ్యులతో కూడిన బృందం.. బుధవారం ప్రమాదానికి గురైన వాహనాన్ని తిరిగి పరిశీలించింది. నిందితుల రక్త నమూనాలను కూడా సేరరించి అందులో మద్యం ఆనవాళ్లు ఉన్నయోలేదో పరీక్షిస్తున్నట్లు తెలిపారు.

ప్రాథమిక నిర్ధరణల ప్రకారం.. కారులో మహిళలు ఉన్నట్లు ఎటువంటి ఆనవాళ్లు లేవు. కారు కింద భాగాలపై రక్తపు మరకలు కనిపించాయి. ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ దిల్లీ పోలీసులకు మూడు నివేదికలను సమర్పించే అవకాశం ఉందని ఫోరెన్సిక్ సభ్యుల బృందం తెలిపింది. సమర్పించాల్సిన మూడు నివేదికల్లో.. మొదటి నివేదిక.. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి తీసిన రక్త నమూనాలతో కూడినది. మరొకటి ఐదుగురు నిందితుల నుంచి సేకరించిన రక్త నమూనాలతో కూడినది. మూడవది నేర దృశ్యం రిక్రీయేట్​ చేయడం.

కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్​ జాబ్​..
మృతురాలు అంజలి సింగ్ కుటుంబాన్ని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్​ సిసోదియా పరామర్శించారు. ఆమె కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. మంగళవారం దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అనంతరం వారి తరపున కోర్టులో పారాడడానికి న్యాయవాదిని కూడా నియమిస్తున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.