కరోనా ప్రభావం చిన్న పిల్లలపై తీవ్రంగా పడిందని భారత్లో చిన్నారుల సంరక్షణ కోసం విశేషంగా పాటుపడుతున్న ప్రముఖ ఉద్యమ కర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఈటీవీ భారత్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. కొవిడ్ ప్రభావంతో కోట్లాది మంది పిల్లలు పాఠశాలలకు దూరమయ్యారని, కొందరు బాలకార్మికులుగా మారారని చెప్పారు. లైంగిక వేధింపులు పెరుగుతున్నాయని, చిన్నారులను వ్యభిచారంలోకి దించుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్ తరపున ఐక్యరాజ్య సమితి సాధారణ మండలిలో ఇటీవల మాట్లాడిన సమయంలో ఈ సమస్యలను లేవనెత్తినట్లు చెప్పారు సత్యార్థి. చిన్నారుల ఆరోగ్యం, విద్యను వేర్వేరుగా చూడకూడదని అన్నారు. చిన్నారులు మరిన్ని సమస్యలు ఎదుర్కోకుండా దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పిల్లల కోసం ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
ఇంటర్వ్యూ
ఇదీ చదవండి- కుమారుడి ప్రాక్టీస్ కోసం తండ్రి 'క్రికెట్ గ్రౌండ్' ప్లాన్