కుంభమేళాలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో అఖాడాలలో ఒకటైన జునా అఖాడా కీలక ప్రకటన చేసింది. కుంభమేళాను తాము శనివారంతో ముగిస్తున్నట్లు తెలిపింది. భక్తుల సంఖ్య కొవిడ్ వ్యాప్తికి దారితీయకుండా లాంఛనప్రాయంగా ఉండాలని జునా అఖాడాకు చెందిన స్వామి అవదేశానందగిరిని ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో కోరారు. అనంతరం.. జునా అఖాడా ఈ ప్రకటన చేసింది.
"కరోనా మహమ్మారి కొనసాగుతున్న నేపథ్యంలో భారత ప్రజల భద్రతే మా మొదటి ప్రాధాన్యత. కుంభమేళాలో మా విధులన్నింటిని పూర్తి చేశాం. ఇది జునా అఖాడా తరపున ముగింపు ప్రకటన."
- స్వామి అవదేశానందగిరి.
హరిద్వార్‌లోని కుంభమేళాలో 30 మంది సాధువులు శుక్రవారం కరోనా బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం 12,484 యాక్టివ్ కేసులు ఉన్నాయి.