ETV Bharat / bharat

ప్రముఖ గోల్డ్​ షాప్​లో కిలో బంగారు నగలు లూటీ - తమిళనాడులో భారీగా బంగారం చోరీ వార్తలు

Jos Alukkas Gold Robbery : ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ జోస్​ అలుక్కాస్​ దుకాణంలో 1.200 కిలోల బంగారం అపహరణకు గురైంది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్​ నగరంలో జరిగింది.

Jos Alukkas Gold Robbery News Today
Jos Alukkas Gold Robbery
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 3:02 PM IST

Updated : Nov 28, 2023, 7:27 PM IST

Jos Alukkas Gold Robbery : తమిళనాడు కోయంబత్తూర్​లోని గాంధీపురంలో పెద్ద ఎత్తున బంగారాన్ని లూటీ చేశారు దొంగలు. ప్రముఖ జువెలరీ సంస్థ జోస్​ అలుక్కాస్​ అండ్​ సన్స్​ దుకాణం నుంచి 1.200 కిలోల బంగారు ఆభరణాలను అపహరించారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, చోరీకి గురైన ఆభరణాల విలువ కోట్లలో ఉంటుందని సమాచారం.

నిందితుడి కోసం స్పెషల్​ టీమ్స్​
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే అమర్చిన సీసీటీవీల్లో రికార్డ్​ అయ్యాయి. మంగళవారం తెల్లవారుజామును 2:30 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి ముసుగు ధరించి దుకాణంలోకి ప్రవేశించినట్లుగా దృశ్యాల్లో కనిపిస్తున్నాయి. 'ఈ ఘటనలో ఇప్పటికే ఒక అనుమానితుడిని గుర్తించాము. నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాము' అని కోయంబత్తూర్​ పోలీస్ కమిషనర్ తిరు వి బాలకృష్ణన్​ తెలిపారు. అయితే దొంగ దుకాణంలోని ఏసీ వెంటిలేషన్​కు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించాడని సీపీ చెప్పారు. అపహరించిన వాటిలో వజ్రాభరణాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. నిందితుడి పాదముద్రలతో పాటు మరికొన్ని ఆధారాలను సేకరించినట్లు కమిషనర్ బాలకృష్ణన్ తెలిపారు. అయితే షాపు లోపల సెక్యూరిటీ సిబ్బందితో సహా 12 మంది ఉన్నా.. దొంగ లోపలికి ప్రవేశించడం గమనార్హం.

  • VIDEO | Gold ornaments weighing up to 25 kg looted from Jos Alukkas & Sons in Gandhipuram, Coimbatore. Police are at the spot and investigating the matter. More details are awaited. pic.twitter.com/J1z19L9XFp

    — Press Trust of India (@PTI_News) November 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • VIDEO | CCTV footage from Jos Allukas & Sons in Gandhipuram, Coimbatore shows a masked man inside the store at 2:30 am.

    According to Coimbatore Police Commissioner Thiru V Balakrishnan, there is only one suspect in the incident as of now. Five special teams have been formed to… pic.twitter.com/6pf6cWtiOa

"ముసుగు వేసుకొని ఉన్న ఓ వ్యక్తి మంగళవారం తెల్లవారుజామున గాంధీపురంలోని జోస్​ అలుక్కాస్​ షోరూమ్​లో దొంగతనానికి పాల్పడ్డాడు. నాలుగు అంతస్తులు కలిగిన ఈ గోల్డ్​ షాప్​లోని మొదటి, రెండో అంతస్తుల్లో ఈ లూటీ జరిగింది. దుకాణంలోకి ప్రవేశించేందుకు ఎడమవైపున ఉన్న ఏసీ వెంటిలేటర్‌కు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించాడు. అపహరణకు గురైన ఆభరణాల విలువ ఎంతనేది ఇప్పుడే చెప్పలేము. విచారణ కొనసాగుతోంది. నిందితుడిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాము. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాము."

- జి.చండీశ్​, కోయంబత్తూర్ డిప్యూటీ కమిషనర్​

'మంగళవారం ఉదయం మేము దుకాణం తెరిచే సమయానికి కుర్చీలు చెల్లచెదురుగా పడి ఉన్నాయి. అనుమానం వచ్చి లోపలకు వెళ్లి చూస్తే బంగారం చోరీ అయినట్లు తెలిసింది. వెంటనే మా యజమాని, పోలీసులకు సమాచారం ఇచ్చాము' అని షాప్​లో పని చేసే సిబ్బంది ఒకరు తెలిపారు.

దిల్లీవాసులకు ఊరట- మెరుగైన గాలి నాణ్యత, 387 పాయింట్లకు చేరిన ఏక్యూఐ!

క్రిమియాలో తుపాను బీభత్సం- స్తంభించిన జనజీవనం, అంధకారంలో 5లక్షల ప్రజలు

Last Updated : Nov 28, 2023, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.