12-17 ఏళ్ల వారిపై సింగిల్ డోసు కొవిడ్ టీకా ట్రయల్స్ కోసం కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీసీఎస్ఓ) అనుమతి కోరింది అమెరికా ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్. ఈ మేరకు మంగళవారం దరఖాస్తు సమర్పించినట్లు సంస్థ వెల్లడించింది. వైరస్‌ను అరికట్టాలంటే పిల్లలు సహా అందరికీ టీకా ఇవ్వడం అత్యవసరమని తెలిపింది.
పెద్దల కోసం సింగిల్ డోసు జాన్సన్ టీకా అత్యవసర వినియోగానికి ఇదివరకే అనుమతించింది భారత ఔషధ నియంత్రణ సంస్థ. ఫాస్ట్ ట్రాక్ రూట్లో అప్రూవల్ పొందిన రెండో టీకా ఇదే.
జాన్సన్‌తో పాటు భారత్‌లో కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్, మోడెర్నా టీకాలు అందుబాటులో ఉన్నాయి.
ఇదీ చూడండి: కొవాగ్జిన్, కొవిషీల్డ్ డోసుల మిక్సింగ్‌పై ప్రయోగాలు