Forest fire landmine explosions: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ఉన్న అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. కార్చిచ్చు మంటల కారణంగా అక్కడ అమర్చిన మందుపాతరలు పేలిపోయినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. గత సోమవారం నుంచే కార్చిచ్చు అంటుకుంది. అది నెమ్మదిగా ఎల్ఓసీ వైపు వ్యాపించడంతో.. చొరబాటుదారులు రాకుండా ఎల్‌ఓసీ వెంట అమర్చిన దాదాపు ఆరు ల్యాండ్‌మైన్లు పేలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు.
దీనిపై అటవీశాఖ అధికారి కనార్ హుస్సేన్ మాట్లాడుతూ.. 'గత మూడు రోజుల నుంచి కార్చిచ్చు చెలరేగుతోంది. బలమైన గాలుల కారణంగా మరింత వ్యాపించింది. ఆర్మీతో కలిసి మంటలను ఆర్పివేస్తున్నాం' అని తెలిపారు. రాజౌరీ జిల్లాలోని సుందర్‌బంది ప్రాంతంలోనూ కార్చిచ్చు అంటుకుంది. అది జిల్లా సరిహద్దులైన ఘంభీర్, నిక్కా, పంజ్‌గ్రాయే, మొఘాలా ప్రాంతాల్లోనూ విస్తరించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: