ETV Bharat / bharat

5 నిమిషాలు, 28 దేశభక్తి గీతాలు, 8 ఏళ్లకే ప్రపంచ రికార్డ్​ - jagathsingpur girl odisha singing talent

ఒడిశాలోని జగత్​సింగ్​పుర్ జిల్లాకు చెందిన ఓ ఎనిమిదేళ్ల చిన్నారి.. సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కేవలం 5 నిమిషాల్లో 28 దేశభక్తి గీతాలు పాడి ఆసియా బుక్​ ఆఫ్​ రికార్డులో చోటు సంపాదించుకుంది.

Jagatsinghpur girl
చిన్నారి రికార్డులు
author img

By

Published : May 19, 2021, 11:50 AM IST

Updated : May 19, 2021, 1:29 PM IST

5 నిమిషాల్లో 28 దేశభక్తి గీతాలు పాడిన చిన్నారి

తక్కువ సమయంలో వేగంగా దేశ భక్తి గీతాలు పాటి ఓ ఎనిమిదేళ్ల చిన్నారి ప్రపంచ రికార్డు సృష్టించింది. కేవలం 5 నిమిషాల్లోనే 28 దేశ భక్తి గీతాలు ఆలపించి ఆసియా బుక్​ ఆఫ్​ రికార్డులో చోటు సంపాదించుంది. ఆ చిన్నారే ఒడిశా జగత్​సింగ్​పుర్​కు చెందిన సాయి సమిక్ష్య.

జిల్లాలోని కాయ్​జంగా గ్రామానికి చెందిన జనరంజన్​ స్వైన్​, సుభాస్మిత దంపతుల కుమార్తె అయిన సాయి సమిక్ష్య.. కటక్​లోని నారాయణ్​ గ్రూప్​ ఆఫ్​ స్కూల్స్​లో​ మూడో తరగతి చదువుతోంది. 5 నిమిషాల్లో 28 భక్తిగీతాలు పాడి ఇంతకుముందు.. ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్సులో చోటు దక్కించుకుంది. ఇటీవలే.. తన ప్రతిభతో ఆసియా బుక్​ ఆఫ్​ రికార్డులోనూ తన పేరు నమోదు చేసుకోగలిగింది. తనకు ఉన్న సంకల్ప శక్తి ద్వారా.. 15 పేజీల్లో ఉండే పాటను ఏడే రోజుల్లోనే పూర్తిగా కంఠస్థం చేసి రాగయుక్తంగా పాడుతోందీ చిన్నారి. లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డులో చోటు దక్కించుకోవటమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తోంది.

తల్లిదండ్రుల ప్రోత్సాహం...

చిన్నప్పటి నుంచి తన తల్లి కవితలు చదువుతుండగా విన్న సాయి సమిక్ష్య వాటిని పాడేందుకు ప్రయత్నించేది. అది గమనించిన ఆమె తల్లితండ్రులు పాటలు పాడటంలో తనను ప్రోత్సహించారు. చిన్న వయస్సులోనే ఎన్నో రికార్డులు తమ కుమార్తె సాధించడం పట్ల ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.

ఆత్మవిసశ్వాసం తోడుగా ఉంటే.. ఏ వయసులోనైనా లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చని సాయి సమిక్ష్య నిరూపిస్తోంది.

ఇదీ చూడండి: యువతుల స్వచ్ఛంద సేవ- కొవిడ్​ మృతులకు అంత్యక్రియలు

Last Updated : May 19, 2021, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.