ETV Bharat / bharat

చైనా టెలికాం కంపెనీ 'పన్ను ఎగవేత'.. ఐటీ శాఖ విస్తృత సోదాలు - చైనా కంపెనీ పన్ను ఎగవేత

IT Raids Huawei: పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో.. చైనా టెలికాం కంపెనీ హువావేపై ఐటీ దాడులు జరిపింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న సంస్థ కార్యాలయాల్లో విస్తృత సోదాలు చేపట్టింది.

IT Raids Huawei
IT Raids Huawei
author img

By

Published : Feb 16, 2022, 3:11 PM IST

IT Raids Huawei: చైనా టెలికాం కంపెనీ హువావేపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిపింది. పన్ను ఎగవేత ఆరోపణలపై విచారణలో భాగంగా సోదాలు నిర్వహించింది. దిల్లీ, గురుగ్రామ్​ సహా కర్ణాటక బెంగళూరులోని కంపెనీ కార్యాలయాల్లో మంగళవారం నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

చట్టాలకు లోబడే..

ఐటీ దాడులపై హువావే స్పందించింది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు తమ కార్యాలయానికి వచ్చినట్లు సమాచారం అందిందని తెలిపింది. భారత్​లో తమ కార్యకలాపాలు చట్టాలు, నియమాలకు లోబడే కొనసాగిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ అంశంపై మరింత సమాచారం కోసం సంబంధిత ప్రభుత్వ విభాగాలను సంప్రదిస్తామని, అధికారులకు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేసింది.

ఇవీ చూడండి: రూ.27 వేల కోట్ల దొంగసొమ్ముతో.. వ్యాపారవేత్తలుగా చలామణి!

'చైనా నుంచే కఠిన సవాళ్లు.. భారత్​తో కలిసి పనిచేసేందుకు సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.