ETV Bharat / bharat

తొలిసారి జాబిల్లి ఫొటోలను తీసిన చంద్రయాన్​-3.. కక్ష్య తగ్గింపు ప్రక్రియ సక్సెస్​ - చంద్రయాన్ 3 ప్రయోగం న్యూస్

ISRO Moon Mission Chandrayaan 3 : చంద్రయాన్‌ 3 కక్ష్య తగ్గింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో). తదుపరి కక్ష్య తగ్గింపును ఆగస్టు 9న నిర్వహించనున్నట్లు తెలిపింది. మరోవైపు.. జాబిలికి చేరువైన చంద్రయాన్‌ 3 వ్యోమనౌక తొలిసారి చంద్రుడి ఉపరితలాన్ని తన కెమెరాలో బంధించింది. ఆ ఫొటోలను ఇస్రో విడుదల చేసింది.

ISRO Moon Mission Chandrayaan 3
ISRO Moon Mission Chandrayaan 3
author img

By

Published : Aug 7, 2023, 6:39 AM IST

Updated : Aug 7, 2023, 7:46 AM IST

ISRO Moon Mission Chandrayaan 3 : చంద్రయాన్‌-3 వ్యోమనౌకను జాబిలి కక్ష్యలో ప్రవేశించిన మరుసటి రోజు.. దాన్ని కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. చంద్రయాన్-3 ఇప్పుడు 170x4,313 కిలోమీటర్ల కక్ష్యను చేరుకున్నట్లు తెలిపింది. తదుపరి కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఆగస్టు 9న నిర్వహిస్తామని ఇస్రో ప్రకటించింది.

  • #WATCH | First images of the moon captured by Chandrayaan-3 spacecraft

    The Moon, as viewed by #Chandrayaan3 spacecraft during Lunar Orbit Insertion (LOI) on August 5: ISRO

    (Video Source: Twitter handle of LVM3-M4/CHANDRAYAAN-3 MISSION) pic.twitter.com/MKOoHI66cP

    — ANI (@ANI) August 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

చంద్రుడి ఉపరితలం ఫొటోలు తీసిన చంద్రయాన్​..
Chandrayaan 3 Captured Moon Images : అటు.. జాబిలికి చేరువైన చంద్రయాన్‌ 3 వ్యోమనౌక.. తొలిసారి చంద్రుడి ఉపరితలాన్ని తన కెమెరాలో బంధించింది. ఆ ఫొటోలను ఇస్రో విడుదల చేసింది. శనివారం లునార్‌ ఆర్బిట్‌ ఇన్సర్షన్‌ ప్రక్రియ సమయంలో ఈ ఫొటోలను చంద్రయాన్‌ తీసినట్లు ఇస్రో పేర్కొంది. జాబిలి కక్ష్యలో ప్రవేశించిన వెంటనే తాను చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిని అనుభవిస్తున్నానని.. చంద్రయాన్‌ 3.. ఇస్రోకు తొలిసారి సందేశం పంపిందని వివరించింది.

  • Chandrayaan-3 Mission:
    The spacecraft successfully underwent a planned orbit reduction maneuver. The retrofiring of engines brought it closer to the Moon's surface, now to 170 km x 4313 km.

    The next operation to further reduce the orbit is scheduled for August 9, 2023, between… pic.twitter.com/e17kql5p4c

    — ISRO (@isro) August 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్​..
Chandrayaan 3 Lunar Orbit Injection : ఆగస్టు 5న చంద్రయాన్‌-3 వ్యోమనౌక జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది. ఇందుకు సంబంధించిన లూనార్‌ ఆర్బిట్‌ ఇంజెక్షన్‌ అనే కీలక విన్యాసాన్ని ఆ రోజు రాత్రి 7 గంటల సమయంలో ఇస్రో చేపట్టింది. ఫలితంగా చంద్రయాన్‌-3.. జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది.

ఆగస్టు 23న జాబిల్లిపై ల్యాండింగ్​..
Chandrayaan 3 Lunar Orbit Insertion : జులై 14న ఎల్‌వీఎం3 ఎం-4 రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌-3ని భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మూడు వారాల్లో ఐదుసార్లు కక్ష్యను పెంచుతూ భూమికి దూరంగా వ్యోమనౌకను తీసుకెళ్లారు. ఆగస్టు 1న ట్రాన్స్‌లూనార్‌ ఇంజెక్షన్‌ అనే కీలక విన్యాసంతో ఈ వ్యోమనౌకను చందమామను చేరుకునే మార్గం లునార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీలోకి ప్రవేశపెట్టారు. అలా జాబిల్లి దిశగా పయనించిన వ్యోమనౌకను ఇప్పుడు చంద్రుని కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. మరో 18 రోజుల పాటు దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో చంద్రుడి చుట్టూ తిరుగుతూ 100 కిలోమీటర్ల ఎత్తు వరకూ రానున్న చంద్రయాన్ 3.. ఆగస్టు 23 సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు జాబిల్లిపై దిగనుంది.

ఇవీ చదవండి:

జాబిల్లికి చేరువలో చంద్రయాన్​-3.. శనివారం మరో కీలక ఘట్టానికి ఇస్రో రెడీ

సరైన దిశలో చంద్రయాన్​-3.. రెండోసారి కక్ష్య మార్పిడి.. ల్యాండింగ్ ఆ సమయానికే..

Last Updated : Aug 7, 2023, 7:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.