ETV Bharat / bharat

అంతరిక్ష సహకారంపై ఇస్రో, ఆస్ట్రేలియా ఒప్పందం - ఇస్రో అవగాహన ఒప్పందం

అంతరిక్ష కార్యకలాపాల్లో సహకారాన్ని పెంచుకునే లక్ష్యంతో ఆస్ట్రేలియా స్పేస్​ ఏజెన్సీ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో).. అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​ గతేడాది చేసిన ప్రకటన మేరకు తాజాగా ఈ ఒప్పందం కుదిరింది.

ISRO and Australian Space Agency sign MoU
అంతరిక్ష భాగస్వామ్యంపై ఇస్రో, ఆస్ట్రేలియా ఒప్పందం
author img

By

Published : Feb 17, 2021, 10:00 PM IST

అంతరిక్ష కార్యకలాపాల్లో సహకారం పెంపొందించుకునే దిశగా.. ఆస్ట్రేలియా, భారత్​లు అడుగులు వేశాయి. ఇందులో భాగంగా.. ఆస్ట్రేలియా స్పేస్​ ఏజెన్సీ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) బుధవారం అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​.. గతేడాది చేసిన ఈ ఒప్పంద ప్రకటన ద్వారా ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం నిర్మితమవుతుందని ఆస్ట్రేలియా కాన్సులేట్​ జనరల్​ కార్యాలయం పేర్కొంది.

"ఈ ఒప్పందం ద్వారా భారత్​, ఆస్ట్రేలియాలు అంతరిక్ష సహకారాన్ని విస్తృతంగా నిర్వర్తిస్తాయి. 2016లో స్పేస్​ ఇండస్ట్రీ అసోసియేషన్​ ఆఫ్​ ఆస్ట్రేలియా.. బెంగళూరు స్పేస్​ ఎక్స్​పో షోలో పాల్గొంది. 2017లో ఇస్రో రాయబారి.. అడిలైడ్​లో ఇంటర్నేషనల్​ ఆస్ట్రోనాటికల్​ కాంగ్రెస్​లో పాల్గొన్నారు."

--ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్​​

గతేడాది నవంబర్​లో ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి బర్మింగ్​ హామ్​ సందర్శించారు. బెంగళూరులో నిర్వహించిన టెక్​ సమ్మిట్​లో 185 మందితో కూడిన ప్రతినిధి బృందానికి మోరిసన్​ నేతృత్వం వహించారు.

ఇదీ చదవండి:ఇస్రో కొత్త మిషన్​- ఈ నెలాఖరున నింగిలోకి సీ-51

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.