ETV Bharat / bharat

Ira Basu: 'మా​ బావే సీఎం అయినా.. నాకు పెన్షన్​ రాలేదు' - ఇరా బసు న్యూస్

వీధుల్లో యాచిస్తూ కనిపించిన​ మాజీ సీఎం మరదలు ఇరా బసు(Ira Basu) గురువారం తిరిగి స్వగృహానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన ఇరా బసు.. తన పింఛను సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్​ బెనర్జీ హామీ ఇచ్చారని తెలిపారు. వీధుల్లో తిరిగే పరిస్థితి ఏర్పడిన కారణంగా తన సోదరి మీరా భట్టాచార్య, బుద్ధదేవ్ దంపతులపై(Ira Basu Buddhadeb Bhattacharya) కోపం లేదని పేర్కొన్నారు.

ira basu
ఇరా బసు
author img

By

Published : Sep 17, 2021, 4:19 PM IST

బంగాల్​ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్​ భట్టాచార్య మరదలు ఇరా బసు(Ira Basu) ఇటీవలే రోడ్లపై భిక్షాటన చేస్తూ కనిపించారు. ఈ వార్త నెట్టింట తెగ వైరల్​ అయిన అనంతరం.. అధికారులు ఆమెను కోల్​కతాలోని లుంబినీ ఆసుపత్రిలో చేర్పించారు. కొద్ది రోజులు ఆసుపత్రిలో ఉంచాక గురువారం తిరిగి ఆమెను(Ira Basu Buddhadeb Bhattacharya) కర్దాలోని తన సొంతింటికి తరలించారు.

ira basu
సొంతింటికి చేరిన ఇరా బసు

ఈ నేపథ్యంలో మాట్లాడిన ఇరా బసు(Ira Basu).. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఓ పాఠశాలలో పనిచేసి పదవీ విరమణ పొందిన సమయంలో బంగాల్​ సీఎంగా బుద్ధదేవ్​ ఉన్నట్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ తన పింఛను సమస్యకు పరిష్కారం దొరకలేదని పేర్కొన్నారు. ఈ కారణంగా తన సోదరి మీరా భట్టాచార్య(Buddhadeb Bhattacharya News) దంపతులపై కోపం పెంచుకోలేదని చెప్పారు. 'బుద్ధదేవ్, మీరా భట్టాచార్య అంటే నాకు చాలా గౌరవం. వారు నా సన్నిహితులు.' అని ఇరా పేర్కొన్నారు.

ira basu
స్వగృహంలో మాజీ సీఎం మరదలు ఇరా బసు

నమ్మకం ఉంది..

తన పింఛను సమస్యను త్వరలోనే పరిష్కంచనున్నట్లు తృణమూల్ కాంగ్రెస్​ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ హామీ ఇచ్చారని ఇరా వెల్లడించారు. అయితే.. పింఛను మంజూరు కాని కారణంగా ఆమె రోడ్లపై తిరుగుతూ భిక్షాటన చేయడానికి కారణం మాత్రం చెప్పనని స్పష్టం చేశారు. అది వ్యక్తిగతమైన విషయమని పేర్కొన్నారు. అవసరమైతే మళ్లీ రోడ్డెక్కడానికి మొహమాటపడనని తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్ల సొంతింటిని వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.

పింఛను సమస్య వల్లే..

బంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్​ భట్టాచార్య భార్య మీరా భట్టాచార్య సోదరి ఇరా బసు. ఆమె వైరాలజీ విభాగంలో పీహెచ్​డీ చేశారు. బంగాల్.. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ప్రియానాథ్ బాలికల పాఠశాలలో ఇరా బసు.. లైఫ్ సైన్సెస్ విభాగంలో 1976 నుంచి 2009లో పదవీ విరమణ పొందేవరకు అధ్యాపకురాలిగా పనిచేశారు. ఆమె పదవీ విరమణ తర్వాత.. పింఛను కోసం ధ్రువపత్రాలను అందించాలని ఇరాను కోరామని.. అయితే ఆమె ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వలేదని.. దీంతో ఆమెకు పింఛను కూడా రావటంలేదని ప్రియనాథ్ స్కూల్ హెడ్ మాస్టర్ కృష్ణకలి చందా తెలిపారు. ఈ కారణంగా ఇరా వీధుల్లో యాచించే పరిస్థితి ఏర్పడింది.

ఇదీ చదవండి:రూ.5000కు బిడ్డను అమ్మేసిన తల్లి- తిరిగివ్వాలని నర్సుపై కేసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.