Indrani Mukherjee letter to CBI: 2012లో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీ ఆసక్తికర విషయం వెల్లడించారు. తన కూతురు షీనా బోరా బతికే ఉందని సీబీఐకి లేఖ రాశారు. జమ్ముకశ్మీర్ లోయలో ఓ మహిళ షీనాను చూశారని లేఖలో పేర్కొన్నారు. వెంటనే షీనా బోరాను కనిపెట్టి తీసుకురావాలని, ఇందుకోసం సహకరించాలని సీబీఐని కోరారు.
Sheena bora in kashmir
2012 ఏప్రిల్ 24న షీనా బోరా హత్య జరిగింది. ఇంద్రాణీ ముఖర్జీతో పాటు షీనా మారు తండ్రి పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ డ్రైవర్ శ్యామ్ సుందర్ రాయ్‌ను ముంబయి పోలీసులు 2015 ఆగస్టులో అరెస్టు చేశారు. షీనాను అపహరించి, హత్య చేశారని అభియోగాలు మోపారు. అప్పటి నుంచి ఇంద్రాణీ జైలులోనే ఉంటున్నారు.
తన మాజీ భర్త కొడుకుతో షీనా రిలేషన్షిప్లో ఉందనే విషయాన్ని ఇంద్రాణీ గ్రహించి ఈ హత్య చేసిందని అధికారులు ఆరోపిస్తున్నారు. తన తల్లి గురించి నిజాలు బయటపెడతానని షీనా హెచ్చరించడం కూడా హత్యకు కారణమై ఉండొచ్చని సీబీఐ వాదిస్తోంది. హత్య తర్వాత.. దాన్ని కప్పిపుచ్చేందుకు పెద్ద కథను అల్లారు ఇంద్రాణీ. షీనా తన సోదరి అని, అమెరికాకు వెళ్లిపోయిందని చెప్పుకొచ్చారు. అయితే, మరో కేసులో ఇంద్రాణీ డ్రైవర్ అరెస్టు కావడం వల్ల షీనా హత్య వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ వాంగ్మూలంతో షీనా మృతదేహాన్ని ముంబయికి దగ్గర్లోని ఓ అడవిలో అధికారులు గుర్తించారు.
ఇదీ చదవండి: షీనాబోరా హత్యకేసులో పీటర్ ముఖర్జీకి బెయిల్