డబ్యూహెచ్ఓ కొవాక్స్ పథకానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ షింగ్లా. ఈ పథకం కోసం 1.1 బిలియన్ వ్యాక్సిన్ డోసులను భారత్ ఉత్పత్తి చేయనుందని స్పష్టం చేశారు. ఇప్పటికే భారత ప్రభుత్వం 2 కోట్ల 30 లక్షల డోసులను ఇతర దేశాలకు అందించిందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు కొవిడ్ వ్యాక్సిన్ అందించాలన్న ఉద్దేశంతో డబ్యూహెచ్ఓ 'కొవాక్స్ పథకాన్ని తీసుకొచ్చింది.
"భారత నాగరికతలో వసుదైవ కుటుంబం ముఖ్యమైన విధానం. విశ్వం అంతా ఒక్కటే అని మేము నమ్ముతాం. కరోనా సమయంలో మేము ఇదే విధానాన్ని అనురించాం. వ్యాక్సిన్ మైత్రి పేరుతో ప్రపంచంలోని చాలా దేశాలకు అత్యవసర వైద్య పరికరాలు అందించాం. భారత్‌లో తయారైన మెడిసిన్‌ను ఇతర దేశాలకు పంపిణీ చేశాం."
-- హర్షవర్ధన్ షింగ్లా, భారత విదేశాంగ కార్యదర్శి
అత్యధికంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే దేశం భారత్ అన్నారు. ఇది ప్రపంచ షేర్లో 60 శాతమని తెలిపారు.
ఇదీ చదవండి : ఆ రాష్ట్రంలో కొత్త కరోనా కేసులు జీరో