2011-15తో పోలిస్తే 2016-20 కాలంలో భారత ఆయుధాల దిగుమతి 33 శాతం మేర క్షీణించిందని స్వీడెన్కు చెందిన సిప్రీ నివేదిక తెలిపింది. ఫలితంగా సరఫరాదారు రష్యా అమితంగా ప్రభావితమైనట్లు పేర్కొంది. భారత్కు అమెరికా నుంచి ఆయుధాల దిగుమతి కూడా 46 శాతానికిపైగా క్షీణించినట్లు వెల్లడించింది.
భారత్ అనుసరిస్తున్న సంక్లిష్ట కొనుగోలు విధానంతో పాటు రష్యా ఆయుధాలపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నం కూడా అందుకు కారణమని తెలిపింది నివేదిక. అయితే.. రాబోయే రోజుల్లో పలువురు సరఫరాదారుల నుంచి భారత్ పెద్దఎత్తున ఆయుధాలు దిగుమతి చేసుకునేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు సిప్రీ తెలిపింది.
దిగుమతులపై ఆధారపడటం తగ్గించి, దేశీయ రక్షణ పరిశ్రమకు ఊతమిచ్చేందుకు కొన్నేళ్ల నుంచి భారత్ పలు చర్యలు చేపడుతోంది. వాటికి మూలధన సేకరణ కోసం దాదాపు రూ.2లక్షల కోట్లు విలువ చేసే 112 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు రాజ్యసభలో కేంద్రమంత్రి శ్రీపాద నాయక్ తెలిపారు.
ఇదీ చూడండి: పీఎం కేర్స్ విరాళాలపై లోక్సభలో గందరగోళం