భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ ప్రాజెక్టుపై కరోనా ప్రభావం పడింది. గగన్యాన్ మిషన్లో భాగంగా.. 2020 డిసెంబర్లో చేపట్టాల్సిన తొలి మానవ సహిత ప్రయోగం మరో ఏడాది పాటు వాయిదా పడినట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి.
"కరోనా కారణంగా గగన్యాన్ మానవ సహిత ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కానుంది. వచ్చే ఏడాది చివరి నాటికి కానీ లేక 2022 ప్రథమార్థంలో చేయడమే లక్ష్యంగా పెట్టకున్నాము. మొదటగా మానవ రహిత ప్రయోగం విజయవంతం అయితే తరువాతగా మానవ సహిత ప్రయోగం చేపడతాం. ఇదే క్రమంలో చంద్రయాన్-3 ప్రయోగానికి కూడా సిద్ధం అవుతున్నాం. దీని లాంఛింగ్కు సంబంధించిన ప్రణాళిక ఇంకా ఖరారు కాలేదు." అని తెలిపారు ఇస్రో ఛైర్మన్ కె.శివన్.
ఇవీ చూడండి:
'గగన్యాన్ సహా 10 ప్రయోగాలపై లాక్డౌన్ ఎఫెక్ట్'