ETV Bharat / bharat

డ్రోన్​ సాయంతో మెడిసిన్ సరఫరా-ట్రయల్స్ షురూ! - టీఏఎస్

సాధారణంగా సినిమా షూటింగులు, భద్రతా పహారా, ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేసేందుకు డ్రోన్లను వినియోగిస్తారు. అలాగే పార్సీళ్లను ఒక చోటు నుంచి మరో చోటుకు చేరవేస్తూ వాణిజ్య పరంగా వాడుతున్న సందర్భాలు ఉన్నాయి. అయితే.. దేశంలోనే తొలిసారిగా కర్ణాటకలో డ్రోన్ల సాయంతో ఔషధాలను తరలిస్తున్నారు.

drone
డ్రోన్, మెడిసిన్ సరఫరా
author img

By

Published : Jun 22, 2021, 6:27 PM IST

Updated : Jun 22, 2021, 7:15 PM IST

ట్రయల్స్ ప్రారంభించిన టీఏఎస్ సంస్థ

దేశంలో తొలిసారి డ్రోన్‌ల ద్వారా ఔషధాలను సరఫరా చేసే ప్రయోగాత్మక ప్రాజెక్టు కర్ణాటక చిక్కబళ్లాపుర జిల్లా గౌరిబిదనూర్‌లో సోమవారం ప్రారంభమైంది. నారాయణ హెల్త్‌కేర్‌ భాగస్వామ్యంతో బెంగళూరుకు చెందిన డ్రోన్‌ నిర్వహణ కంపెనీ టీఏఎస్ దీనికి నేతృత్వం వహిస్తోంది. రెండు డ్రోన్ల సాయంతో గగన మార్గంలో మందులను తరలిస్తున్నారు. ఇందులో మెడ్‌ కాప్టర్‌గా పిలిచే ఓ డ్రోన్‌కు కేజీ బరువున్న ఔషధాలను 15 కిలో మీటర్ల దూరం మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. ర్యాండింట్‌ అనే. మరో డ్రోన్‌ 2 కేజీల బరువును 12 కిలో మీటర్ల దూరం తీసుకెళ్లగలుగుతుంది. ఈ రెండింటినీ 30 నుంచి 45 రోజుల పాటు పరిశీలించనున్నారు.

drone, bangaluru
డ్రోన్ సాయంతో మెడిసిన్ సప్లై
drone, bangaluru
ట్రయల్స్ ప్రారంభించిన టీఏఎస్ సంస్థ

డ్రోన్‌ ద్వారా ఔషధాలను సరఫరా చేసే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ఈ ప్రయోగంలో గుర్తిస్తారు. తద్వారా సమస్యలను అధిగమించేందుకు కావాల్సిన చర్యలను వారు చేపడతారు. డ్రోన్ల ద్వారా ఔషధాల తరలింపు ప్రక్రియను 100 గంటలు పరిశీలించిన అనంతరం పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌-డీజీసీఏకు నివేదిక సమర్పిస్తామని టీఏఎస్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. గౌరిబిదనూర్‌లోని గగనతలంలో 20 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి.

టీఏఎస్ అనే డ్రోన్ల నిర్వహణ సంస్థ.. ఔషధాల చేరవేతలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించేందుకు సోమవారం ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది.

drone, bangaluru
మెడిసిన్ సరఫరా చేస్తున్న డ్రోన్

ఇదీ చదవండి:డ్రోన్లతో ఇంటికే మెడిసిన్​- దేశంలో తొలిసారి

Last Updated : Jun 22, 2021, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.