Indian Coast Guard Jobs 2023 : కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఓ తీపి కబురు చెప్పింది ఇండియన్ కోస్ట్ గార్డ్. కేవలం పది, ఇంటర్మీడియేట్ పాసై సంబంధిత విభాగంలో కాస్త పని అనుభవం ఉంటే చాలు చక్కని గౌరవ వేతనంతో కూడిన 10 గ్రూప్ సీ పోస్టులకు ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు వచ్చే నెల 29 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
HQ Coast Guard Recruitment : ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈ కింది పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
- స్టోర్ కీపర్-II- 1
- ఇంజిన్ డ్రైవర్- 1
- సివిలియన్ మోటార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్)- 2
- ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్- 1
- షీట్ మెటల్ వర్కర్ (స్కిల్డ్)- 1
- కార్పెంటర్ (స్కిల్డ్)- 1
- అన్‌స్కిల్డ్ లేబరర్- 1
- మోటార్ ఫిట్టర్- 2
ఈ పోస్టుకు ఈ అర్హత..
- స్టోర్ కీపర్-II- 12వ తరగతి(ఇంటర్) పాసై ఉండాలి. దీంతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థలు, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ లేదా ఏదైనా గుర్తింపు పొందిన కంపెనీలో ఒక సంవత్సరం పాటు స్టోర్ కీపర్‌గా పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.
- ఇంజిన్ డ్రైవర్- పదో తరగతి పాసై ఉండాలి. అలాగే ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా సంస్థలో ఇంజిన్ డ్రైవర్‌గా పని చేసిన అనుభవం ఉండాలి. ఇక మిగతా పోస్టులకు సంబంధించి విద్యార్హతలు ఏంటి అనే వివరాల కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారిక వెబ్‌సైట్‌ను వీక్షించొచ్చు.
ఈ వయసు వారు అర్హులు..
- స్టోర్ కీపర్-II- 18-25 సంవత్సరాలు
- ఇంజీన్ డ్రైవర్- 18-30 సంవత్సరాలు
- సివిలియన్ ఎంటీ డ్రైవర్- 18-27
- ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్- 18-27
- షీట్ మెటల్ వర్కర్- 18-27
- కార్పెంటర్- 18-27
- అన్‌స్కిల్డ్ లేబరర్- 18-27
- మోటార్ ఫిట్టర్- 18-27
ఇక వివిధ కేటగిరీలకి సంబంధించి వయోపరిమితి మినహాయింపుల కోసం అఫీషియల్ వెబ్‌సైట్‌ను చూడొచ్చు.
అప్లై చేసుకొండిలా..
HQ Coast Guard Application : ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు పైన తెలిపిన పోస్టులకు అప్లై చేసుకోవడానికి www.indiancoastguard.gov.in వెబ్సైట్లో నిర్ణీత అప్లికేషన్ ఫారమ్‌ను అందుబాటులో ఉంచారు. దాని ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం ఎంత?
Indian Coast Guard Job Salary : అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న పోస్టు ఆధారంగా జీతభత్యాలు ఉంటాయి. సాధారణంగా ఈ రకమైన పోస్టులకు నెలకు రూ.18000-25000 వరకు వేతనాలు ఉంటాయి.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 2023, ఆగస్టు 29
జాబ్ లొకేషన్..
Indian Coast Guard NE Region : కోస్ట్ గార్డ్ రీజియన్(నార్త్ ఈస్ట్), కోల్‌కతాలోని హెడ్‌క్వార్టర్స్ పరిధిలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.