ETV Bharat / bharat

ఏకకాలంలో రెండు డిగ్రీలు.. భారతీయ​, విదేశీ విద్యాసంస్థలు కలిసి!

UGC Joint Degrees: డిగ్రీ చదవాలనుకునే విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిషన్​ మరో గుడ్​న్యూస్​ చెప్పింది. ఏకకాలంలో రెండు డిగ్రీలను భారతీయ, విదేశీ విద్యాసంస్థల నుంచి చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

Indian and foreign institutions to be able to offer joint degrees

author img

By

Published : Apr 19, 2022, 7:25 PM IST

UGC Joint Degrees: ఒకే విశ్వవిద్యాలయం నుంచి లేదా వేర్వేరు యూనివర్సిటీల నుంచి ఏకకాలంలో రెండు డిగ్రీ ప్రోగ్రాంలు చేయడానికి ఇటీవలే యూజీసీ అనుమతించింది. ఇప్పుడు ఆ జాయింట్/డ్యూయల్​ డిగ్రీ కోర్సులు సహా ట్విన్నింగ్​ ప్రోగ్రాంలను భారతీయ​, విదేశీ ఉన్నత విద్యాసంస్థలు కలిసి అందించేందుకు పచ్చజెండా ఊపినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన నిబంధనలను ఆమోదించినట్లు తెలిపిన యూజీసీ ఛైర్మన్​ ఎం.జగదీశ్​ కుమార్​.. అతి త్వరలో ఈ విధానం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన ఉన్నత విద్యామండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

''నేషనల్​ అసెస్​మెంట్​ అండ్​ అక్రిడిటేషన్​ కౌన్సిల్​ గుర్తింపు పొందిన ఏదైనా భారతీయ విద్యాసంస్థ లేదా ఎన్​ఐఆర్​ఎఫ్​ యూనివర్సిటీ ర్యాంకింగ్స్​లోని టాప్​-100 విద్యాసంస్థ లేదా విదేశీ విద్యాసంస్థతో అనుసంధానమైన టైమ్స్​ హయ్యర్​ ఎడ్యుకేషన్​ టాప్​-500లోని విద్యాసంస్థల్లో ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే ఈ డిగ్రీ ప్రోగ్రాంలకు అనుమతి ఉంటుంది.''

- జగదీశ్​ కుమార్​, యూజీసీ ఛైర్మన్​

ఈ కార్యక్రమం కింద విద్యార్థులు విదేశీ విద్యాసంస్థ నుంచి.. 30 శాతానికిపైగా క్రెడిట్‌లను పొందాల్సి ఉంటుందని జగదీశ్​ కుమార్​ వెల్లడించారు. అయితే, ఆన్‌లైన్‌ లేదా ఓపెన్​, దూరవిద్య ప్రోగ్రాంలకు ఈ నిబంధనలు వర్తించవని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: భర్త కర్కశత్వం.. అసహజ రీతిలో శృంగారం.. కరెంట్​ షాక్​తో చిత్రహింసలు

ఎస్సై నోటిఫికేషన్ వచ్చేసింది... ఇంజినీర్ పోస్టులకు కూడా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.