VL SRSAM: ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే స్వల్ప శ్రేణి క్షిపణిని డీఆర్డీఓ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. వీఎల్-ఎస్ఆర్ఎస్ఏఎంగా పిలిచే ఈ క్షిపణిని నిట్టనిలువుగా ప్రయోగించివచ్చని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ వెల్లడించింది. ఇది 15 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో చేరుకోగలదని తెలిపింది. సీనియర్ నావికాదళ అధికారుల సమక్షంలో ఈ పరీక్ష జరిగినట్లు వెల్లడించింది. యుద్ధనౌకల్లో వినియోగించే వాయు రక్షణ వ్యవస్థను డీఆర్డీఓ అభివృద్ధి చేస్తోంది.
high speed expendable aerial target: వివిధ క్షిపణి వ్యవస్థలను అంచనా వేసేందుకు ఉపయోగించే హై-స్పీడ్ ఎక్స్‌పాండబుల్ ఏరియల్ టార్గెట్ (హీట్), అభ్యాస్ క్షిపణులను గత నెలలో డీఆర్డీఓ ప్రయోగించింది. వీటిని ఒడిశాలోని చాందీపుర్ సమీకృత క్షిపణి ప్రయోగ కేంద్రం(ఐటీఆర్) విజయవంతంగా పరీక్షించింది.
ఇవీ చదవండి: