గో ఫస్ట్ విమానయాన సంస్థకు(Go first airline) చెందిన శ్రీనగర్-షార్జా విమాన సర్వీసు(Srinagar sharjah flight) తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు అనుమతించాలని పాకిస్థాన్‌ను భారత్ కోరింది. ఈ మార్గంలో టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు అభ్యర్థించినట్లు అధికారులు తెలిపారు.
గో ఫస్ట్ విమాన సర్వీసు(Srinagar sharjah flight) తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు పాక్ మంగళవారం అనుమతి నిరాకరించింది. దీంతో ఈ విమానం చుట్టూ తిరిగి గుజరాత్ మీదుగా వెళ్లాల్సి వచ్చిందని, దీనికి అదనంగా 40 నిమిషాల సమయం పట్టిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
"అక్టోబర్ 23, 24, 26, 28 తేదీల్లో శ్రీనగర్-షార్జా సర్వీసును(Srinagar sharjah flight) తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు పాకిస్థాన్ అనుమతించింది. అక్టోబరు 31 నుంచి నవంబరు 30 వరకు అనుమతులను పాక్ నిలిపివేసింది. ఈ విషయాన్ని పాకిస్థాన్‌తో దౌత్యమార్గాల ద్వారా చర్చకు తీసుకువచ్చాం. ఈ మార్గంలో టికెట్లు బుక్ చేసుకున్న సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు అనుమతి మంజూరు చేయాలని అభ్యర్థించాం."
-ప్రభుత్వ వర్గాలు.
జమ్ముకశ్మీర్ పర్యటనలో భాగంగా.. షార్జా- శ్రీనగర్ మధ్య విమాన సేవలను(Srinagar sharjah flight) కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబరు 23న ప్రారంభించారు. ప్రారంభించిన వారం రోజులకే పాక్ ఇలాంటి ఆంక్షలు విధించటం చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. పాక్ చర్య దురదృష్టకరమైందని పేర్కొన్నారు. 2009-10లోనూ పాక్ ఇదే రీతిలో శ్రీనగర్-దుబాయ్ విమానాన్ని అడ్డుకుందని గుర్తు చేశారు.
మరోవైపు.. గో ఫస్ట్ విమాన సర్వీసును తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు నిరాకరించిన విషయాన్ని పాక్ ధ్రువీకరించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇఫ్తియాకర్ అహ్మద్... ఇస్లామాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దీనికి అనేక కారణాలు ముడివడి ఉన్నాయని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: