దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఆందోళనకర స్థాయిలో కొత్తగా 4,01,993 కేసులు వెలుగుచూశాయి. వైరస్ బారినపడిన వారిలో మరో 3,523 మంది చనిపోయారు.
- మొత్తం కేసులు: 1,91,64,969
- మొత్తం మరణాలు: 2,11,853
- మొత్తం కోలుకున్నవారు: 1,56,84,406
- యాక్టివ్ కేసులు: 32,68,710
ఇదీ చదవండి: కొవిడ్ కల్లోల'మే'- హెచ్చరించినా పట్టించుకోని కేంద్రం!
కొవిడ్ సోకిన వారిలో 2,99,988 మంది కోలుకున్నారు. దేశవ్యాప్త రికవరీ రేటు 81.84 శాతానికి పడిపోగా.. మరణాల రేటు 1.11 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా శుక్రవారం 19.45 లక్షల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్‌ల సంఖ్య 28 కోట్ల 83 లక్షలు దాటింది.
కరోనా కట్టడిలో భాగంగా.. ఇప్పటివరకు మొత్తం 15.49 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ఇవీ చదవండి: