దేశంలో కొవిడ్-19 కేసులు కొద్ది రోజులుగా తగ్గుదల నమోదవుతుండగా.. ఇవాళ కొత్త కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదైంది. క్రితం రోజుతో పోల్చుకుంటే కొత్త కేసుల్లో సుమారు 61శాతానికిపైగా పెరుగుదల కనిపించింది. కొత్తగా 18,855 మంది కరోనా బారినపడగా.. 163 మంది మరణించారు.
- మొత్తం కేసులు: 1,07,20,048
- యాక్టివ్ కేసులు: 1,71,686
- కోలుకున్నవారు: 1,03,94,352
- మొత్తం మరణాలు: 1,54,010
తాజాగా 20,746 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.96 శాతానికి చేరింది. మరణాల రేటు స్థిరంగా 1.44 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
మరోవైపు.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. గురువారం ఒక్కరోజే సుమారు 5లక్షల మందికి టీకా అందించినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు 29లక్షల మందికిపైగా టీకా పంపిణీ చేసినట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది.
దేశవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 7లక్షల 42వేల 306 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. మొత్తం టెస్ట్‌ల సంఖ్య 19కోట్ల 50లక్షలు దాటింది.
ఇదీ చదవండి: కరోనా టీకా పంపిణీ- టాప్ 5లో భారత్