దేశవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 13,203 వైరస్ కేసులు వెలుగుచూశాయి. మరో 131 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 1,06,67,736కు చేరగా.. మరణాల సంఖ్య 1,53,470కి పెరిగింది.
తాజాగా 13వేల మందికిపైగా మహమ్మారిని జయించగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,03,84,000లకు చేరింది. 1.84 లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 96.83 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.44శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
మరోవైపు.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 16లక్షల మందికిపైగా టీకా అందించినట్టు పేర్కొంది ఆరోగ్య శాఖ.
దేశవ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజులో 5లక్షల 70వేల 246 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఫలితంగా మొత్తం టెస్ట్‌ల సంఖ్య 19కోట్ల 23లక్షలు దాటింది.
ఇదీ చదవండి: 16 లక్షలు దాటిన టీకా లబ్ధిదారుల సంఖ్య