దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంగా జోరుగా సాగుతోంది. గురువారం ఒక్కోరోజే 36.7 లక్షలకుపైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం తెలిపింది. ఒక్కరోజు అందించిన వ్యాక్సిన్ డోసుల్లో ఇదే అత్యధికం అని పేర్కొంది. దేశంలో మొత్తం పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 6.87 కోట్లకు చేరిందని వెల్లడించింది.
వ్యాక్సినేషన్ లెక్కల్లో..
- గురువారం మొత్తం అందజేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 36,71,242.
- ఇందులో 33,65,597 మంది లబ్ధిదారులు టీకా మొదటి డోసు తీసుకోగా.. 3,05,645 మంది టీకా రెండో డోసు తీసుకున్నారు.
- దేశంలో శుక్రవారం ఉదయం 7 గంటలవరకు అందజేసిన మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య 6,87,89,138.
- మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల్లో 59.8 శాతం 8 రాష్ట్రాల్లోనే పంపిణీ చేశారు. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్, బంగాల్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ ఈ జాబితాలో ఉన్నాయి.
దేశంలో మొత్తం 6,14,696 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్రం తెలిపింది. గురువారం ఒక్కరోజే 30,641 యాక్టివ్ కేసులు నమోదయ్యాయని చెప్పింది.
భారత్లోని మొత్తం కేసుల్లో ఒక్క మహారాష్ట్రలోనే 59.8 శాతం మంది కరోనా బారిన పడ్డారని తెలిపింది.
ఇదీ చూడండి: కొవిడ్ పంజా: దేశంలో మరో 81,466 కేసులు