GDS recruitment 2022: భారత తపాలా శాఖలో నియామకాల కోసం వెలువడిన నోటిఫికేషన్ దరఖాస్తుకు ఇవాళే(జూన్ 5, ఆదివారం) ఆఖరు తేదీ. గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ఇటీవల ప్రకటన వెలువరించింది ఇండియా పోస్ట్. 38,926 పోస్టులను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
ఖాళీలు:
➼దేశవ్యాప్తంగా 38,926 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
➼బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
అర్హతలు
➼పదో తరగతి పాసై ఉండాలి. పదో తరగతిలో స్థానిక భాష నేర్చుకొని ఉండాలి.
➼సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
➼18 ఏళ్లు పైబడి, 40 ఏళ్లలోపు వయసు ఉన్నవారంతా ఈ ఉద్యోగానికి దరఖాస్తులు చేసుకోవచ్చు.
వేతనం
➼బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జాబ్‌కు ఎంపికైతే ప్రతి నెలా రూ.12000 చెల్లిస్తారు.
➼అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 వేతనం అందిస్తారు.
ఎంపిక ఎలా?
➼పదో తరగతిలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నిబంధనల ప్రకారం మెరిట్ లిస్ట్‌ను సిద్ధం చేస్తారు.
దరఖాస్తు
➼ indiapostgdsonline.gov.in వెబ్సైట్లో అప్లికేషన్ నింపవచ్చు.
➼జూన్ 5 చివరి తేదీ.
➼దరఖాస్తు ఫీజు రూ.100
ఇదీ చదవండి: ప్రభుత్వ బ్యాంకులో 'స్పెషల్' ఉద్యోగాలు.. జీతం రూ.78వేల పైనే!