India Middle East Europe Corridor : దిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సులో ప్రతిష్ఠాత్మకమైన భారత్- పశ్చిమాసియా-ఐరోపా కారిడార్ ప్రణాళికలను ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. కనెక్టివిటీని భారత్ ఎప్పుడూ ప్రాంతీయ సరిహద్దులకు పరిమితం చేయదని ప్రధాని మోదీ తెలిపారు. పరస్పర విశ్వాసాన్ని బలోపేతం చేయడంలో ఈ కారిడార్ కీలక పాత్ర పోషిస్తుందని మోదీ పేర్కొన్నారు.
భారత్- పశ్చిమాసియా-ఐరోపా ఎకనామిక్ కారిడార్, గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభ కార్యక్రమంలో మోదీ పలు వ్యాఖ్యలు చేశారు. రాబోయే కాలంలో ఈ కారిడార్ భారత్- ఐరోపా ఆర్థిక ఏకీకరణకు సమర్థవంతమైన మాధ్యమంగా మారుతుందని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కనెక్టివిటీ, అభివృద్ధికి స్థిరమైన దిశను ఇస్తుందన్నారు మోదీ. అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, సమగ్రతను గౌరవించాలని కోరారు.
-
Charting a journey of shared aspirations and dreams, the India-Middle East-Europe Economic Corridor promises to be a beacon of cooperation, innovation, and shared progress. As history unfolds, may this corridor be a testament to human endeavour and unity across continents. pic.twitter.com/vYBNo2oa5W
— Narendra Modi (@narendramodi) September 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Charting a journey of shared aspirations and dreams, the India-Middle East-Europe Economic Corridor promises to be a beacon of cooperation, innovation, and shared progress. As history unfolds, may this corridor be a testament to human endeavour and unity across continents. pic.twitter.com/vYBNo2oa5W
— Narendra Modi (@narendramodi) September 9, 2023Charting a journey of shared aspirations and dreams, the India-Middle East-Europe Economic Corridor promises to be a beacon of cooperation, innovation, and shared progress. As history unfolds, may this corridor be a testament to human endeavour and unity across continents. pic.twitter.com/vYBNo2oa5W
— Narendra Modi (@narendramodi) September 9, 2023
ఇది ఒక చారిత్రక ఒప్పందం : బైడెన్
India Middle East Europe Transport Corridor : భారత్- పశ్చిమాసియా కారిడార్ కోసం తాము చారిత్రక ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నట్లు ప్రకటించడం గర్వంగా ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. "ఈ కారిడార్‌లో కీలక భాగంగా.. భారత్ నుంచి ఐరోపా వరకు.. మధ్యలో UAE, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయిల్‌లో నౌకలు, రైళ్లపై పెట్టుబడులు పెడుతున్నాం. ఇది మా వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది. ప్రధాని మోదీ, సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను" అని బైడెన్ తెలిపారు.
'భారత్-ఐరోపా వాణిజ్య సంబంధాలు'
ఐరోపా కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఈ కారిడార్ ఒప్పందాన్ని చారిత్రకమైనదిగా వర్ణించారు. ఈ కారిడార్ భారత్, సౌదీ అరేబియా, గల్ఫ్, ఐరోపా మధ్య అత్యంత ప్రత్యక్ష కనెక్టవిటీ అని తెలిపారు. దీని ద్వారా భారత్- ఐరోపా మధ్య వాణిజ్యం 40 శాతం వేగవంతం అవుతుందని చెప్పారు. కొత్త కారిడార్ ప్రారంభం.. ప్రపంచ ఏకీకరణను బలోపేతం చేయడంలో ఒక మైలురాయి అని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అన్నారు. ఈ కారిడార్ విషయంలో సహకారం అందించడానికి జర్మనీ కట్టుబడి ఉందని ఆ దేశ ఛాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్ తెలిపారు.
-
#WATCH | G 20 in India | European Commission President Ursula von der Leyen says "More large-scale projects are seeing the light...We are presenting two of them today. First the India-Middle East-Europe economic corridor...It will be the most direct connection to date between… pic.twitter.com/QgopIdtfSL
— ANI (@ANI) September 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | G 20 in India | European Commission President Ursula von der Leyen says "More large-scale projects are seeing the light...We are presenting two of them today. First the India-Middle East-Europe economic corridor...It will be the most direct connection to date between… pic.twitter.com/QgopIdtfSL
— ANI (@ANI) September 9, 2023#WATCH | G 20 in India | European Commission President Ursula von der Leyen says "More large-scale projects are seeing the light...We are presenting two of them today. First the India-Middle East-Europe economic corridor...It will be the most direct connection to date between… pic.twitter.com/QgopIdtfSL
— ANI (@ANI) September 9, 2023
ఒప్పందంపై సంతకం చేసింది వీళ్లే..
India Middle East Europe Economic Corridor : భారత్- పశ్చిమాసియా కారిడార్ ఏర్పాటుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై భారత్, అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, ఐరోపా యూనియన్ సంతకాలు చేసినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ కారిడార్.. పశ్చిమాసియా, ఐరోపా మధ్య మెరుగైన కనెక్టివిటీతోపాటు ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందిస్తుందని చెప్పారు.
-
India, USA, UAE, Saudi Arabia, France, Germany, Italy and the European Union Commission have signed the Memorandum of Understanding to establish the India-Middle East-Europe Economic Corridor (IMEE EC). This will encourage and provide impetus to economic development through… pic.twitter.com/vMMdguHlaA
— ANI (@ANI) September 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">India, USA, UAE, Saudi Arabia, France, Germany, Italy and the European Union Commission have signed the Memorandum of Understanding to establish the India-Middle East-Europe Economic Corridor (IMEE EC). This will encourage and provide impetus to economic development through… pic.twitter.com/vMMdguHlaA
— ANI (@ANI) September 9, 2023India, USA, UAE, Saudi Arabia, France, Germany, Italy and the European Union Commission have signed the Memorandum of Understanding to establish the India-Middle East-Europe Economic Corridor (IMEE EC). This will encourage and provide impetus to economic development through… pic.twitter.com/vMMdguHlaA
— ANI (@ANI) September 9, 2023
ప్రపంచం కోసం భారత్.. జీవ ఇంధన కూటమి ఏర్పాటు.. వారందరికీ మోదీ పిలుపు
G20 Declaration 2023 : 'అణ్వాయుధాల ముప్పు ఆమోదయోగ్యం కాదు'.. ఉక్రెయిన్ యుద్ధంపై దిల్లీ డిక్లరేషన్