ETV Bharat / bharat

'భారతే ముఖ్యం.. పాక్​కు పరిమిత సహకారం' - రష్యా సహకారం భారత్​కు

భారత్​ను అత్యంత విశ్వసనీయమైన భాగస్వామిగా అభివర్ణించింది రష్యా. పాకిస్థాన్​కు పరిమిత సహకారం మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పింది. కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్​-పాక్​ ఒకే తాటిపైకి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొంది.

India is a trusted partner; limited cooperation with Pakistan: Russia
'భారత్​ అత్యంత విశ్వనీయమైన భాగస్వామి'
author img

By

Published : Apr 14, 2021, 7:02 PM IST

భారత్​ను అత్యంత విశ్వనీయమైన భాగస్వామిగా రష్యా అభివర్ణించింది. ఇరుదేశాల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు, విభేదాలు లేవని తేల్చి చెప్పింది. రష్యా నుంచి పాకిస్థాన్​కు పరిమిత సహకారం మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.

2003లో భారత్​-పాక్​ చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం అమలుపై ఇరుదేశాలు ఏకతాటిపైకి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు రష్యా మిషన్ డిప్యూటీ చీఫ్ రోమన్​ బాబూష్కిన్​ తెలిపారు. ఈ ఒప్పందం సరిహద్దుల్లో ఉండే ప్రాంతీయ స్థిరత్వానికి చాలా ముఖ్యమని పేర్కొన్నారు. దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. అఫ్గాన్ విషయంలో రష్యా-భారత్ కలిసి పనిచేస్తాయని వెల్లడించారు.

"అఫ్గానిస్థాన్​పై ప్రాంతీయంగా ఏకాభిప్రాయాన్ని రూపొందించడానికి భారత్​ తప్పనిసారిగా చొరవ చూపాలి. ఇందుకు సంబంధించి ఇరుదేశాలు కలిసి పనిచేస్తాయి."

-రోమన్ బాబూష్కిన్​, రష్యా మిషన్ డిప్యూటీ చీఫ్

మరోవైపు.. పశ్చిమ దేశాలు అమలు చేస్తున్న ఇండో-పసిఫిక్​ వ్యూహం చాలా ప్రమాదకరమైనదని రష్యా రాయబారి నికోలే కుదాషెవ్ పేర్కొన్నారు. ఇది యుద్ధ వాతావరణాన్ని మరింత ప్రేరేపిస్తుందని అన్నారు.

ఇదీ చూడండి: 'ఎస్-400 క్షిపణి ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.