ETV Bharat / bharat

'సొంత ఆయుధ వ్యవస్థతో సిద్ధంగా ఉండాల్సిందే'

India Indigenous Weapon: రక్షణ వ్యవస్థలో ఆత్మనిర్భర్ వైపు భారత్ అడుగులు వేయాలని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే అన్నారు. భవిష్యత్తులో యుద్ధాలను ఎదుర్కోవడానికి స్వదేశీ ఆయుధ వ్యవస్థలతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఉక్రెయిన్- రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధం ఈ పాఠాన్నే నేర్పుతోందని తెలిపారు.

Ukraine crisis
ఉక్రెయిన్ యుద్ధం
author img

By

Published : Mar 9, 2022, 7:50 AM IST

India Indigenous Weapon: భవిష్యత్తులో యుద్ధాలను ఎదుర్కోవడానికి స్వదేశీ ఆయుధ వ్యవస్థలతో సిద్ధంగా ఉండాలని అన్నారు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఉక్రెయిన్- రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధం ఈ గుణపాఠాన్ని నేర్పుతోందని చెప్పారు.

"కొనసాగుతున్న ఉక్రెయిన్- రష్యా యుద్ధం నుంచి నేర్చుకోగల అనేక పాఠాలు ఉన్నాయి. యుద్ధాలు ఎప్పుడైనా జరగవచ్చని ఈ సంక్షోభం సూచిస్తుంది. భవిష్యత్తులో స్వదేశీ ఆయుధాలతో పోరాడటానికి మనం సిద్ధంగా ఉండాలి. రక్షణ వ్వవస్థలో ఆత్మనిర్భర్ వైపు భారత్ అడుగులు వేయాలి."

-మనోజ్ ముకుంద్ నరవాణే, ఆర్మీ చీఫ్

రష్యా, ఉక్రెయిన్ నుంచి భారత్​ చాలాకాలంగా విడి పరికరాలు, ఆయుధాలను దిగుమతి చేసుకుంటోంది. ఈ యుద్ధం నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ఈ విధంగా స్పందించారు. ఉక్రెయిన్​పై రష్యా ఫిబ్రవరి 24న మొదలుపెట్టిన యుద్ధం.. 13 రోజులుగా కొనసాగుతోంది. బాంబుల మోతతో నగరాలు దద్దరిల్లుతున్నాయి.

ఇదీ చదవండి: కేంద్రం గుడ్​న్యూస్.. విమాన సర్వీసులపై నిషేధం ఎత్తివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.