Covid Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 16,678 మంది వైరస్ బారినపడగా.. మరో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి తాజాగా 14,629మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.51 శాతానికి పడిపోయింది. రోజువారీ పాజిటివిటీ రేటు మాత్రం 5.99 శాతానికి పెరిగింది.
- మొత్తం కేసులు: 43,639,329
- మొత్తం మరణాలు: 5,25,454
- యాక్టివ్ కేసులు: 1,30,713
- కోలుకున్నవారి సంఖ్య:4,29,83,162
Vaccination India: భారత్‌లో ఆదివారం 11,44,145 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,98,88,77,537కు చేరింది. మరో 2,78,266 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 4,11,725 మంది వైరస్ బారినపడ్డారు. మరో 584 మంది మహమ్మారితో ప్రాణాలు విడిచారు. మొత్తం కేసుల సంఖ్య 56,06,54,133 కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 63,73,019 మంది మరణించారు. ఒక్కరోజే 5,15,132 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 53,36,69,803కు చేరింది.
- ఇటలీలో కొత్తగా 79,920 మందికి వైరస్ సోకగా.. 44 మంది మరణించారు.
- జపాన్‌లో 51,738 మంది వైరస్ బారిన పడ్డారు. 13మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో ఒక్కరోజే 23,939 మంది కొవిడ్ బారినపడగా.. 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మెక్సికోలో 32,195 మంది వైరస్ బారిన పడ్డారు. 55 మరణించారు.
- ఆస్ట్రేలియాలో 31,406 కేసులు నమోదు కాగా.. 13 మంది మరణించారు.
ఇవీ చదవండి: దక్షిణాదిపై భాజపా గురి.. '2024' కోసం పక్కా ప్లాన్‌తో..
గోవాలో కాంగ్రెస్‌కు షాక్.. ఐదుగురు ఎమ్మెల్యేలు దూరం.. త్వరలో భాజపాలోకి?