ETV Bharat / bharat

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. 45మంది మృతి

Covid Cases In India: భారత్​లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. తాజాగా 16,906 మంది కొవిడ్ బారినపడ్డారు. 45 మంది మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు.

Covid Cases In India
Covid Cases In India
author img

By

Published : Jul 13, 2022, 9:27 AM IST

Covid Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 16,906 మంది వైరస్​ బారినపడగా.. మరో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 15,447 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.51 శాతానికి పడిపోయింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.29 శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు మాత్రం 3.68 శాతానికి పెరిగింది.

  • మొత్తం మరణాలు: 5,25,519
  • యాక్టివ్​ కేసులు: 1,32,457
  • కోలుకున్నవారి సంఖ్య: 4,30,11,874

Vaccination India: భారత్​లో మంగళవారం 11,15,068 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,99,12,79,010కు చేరింది. మరో 4,59,302 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 9,59,642 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,547 మంది మహమ్మారితో ప్రాణాలు విడిచారు. మొత్తం కేసుల సంఖ్య 56,28,51,812కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 63,76,619 మంది మరణించారు. ఒక్కరోజే 8,03,110 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 53,54,02,116కు చేరింది.

  • ఫ్రాన్స్​లో 1,82,006 మంది వైరస్​ బారిన పడ్డారు. 126మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇటలీలో కొత్తగా 1,42,967మందికి వైరస్​ సోకగా.. 157మంది మరణించారు.
  • జర్మనీ​లో 127,611కేసులు నమోదు కాగా.. 104మంది మరణించారు.
  • అమెరికా​లో ఒక్కరోజే 95,342 మంది కొవిడ్​ బారినపడగా.. 254 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి:

యువతిపై ఐఎఫ్​ఎస్​ అధికారి అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి!

లాలూకు మందుల ఓవర్​డోస్.. సింగపూర్​ తరలింపు కష్టమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.