భారత్‌లో కరోనా కేసులు (Corona cases in India) స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 10,488 మందికి కొవిడ్ (Corona cases in India) పాజిటివ్‌గా తేలింది. వైరస్ (Coronavirus India) ధాటికి మరో 313 మంది మరణించారు. ఒక్కరోజే 12,329 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఫలితంగా రికవరీ రేటు 98.30 శాతానికి చేరింది. క్రియాశీల కేసుల సంఖ్య 2020 మార్చి నుంచి 0.36 శాతానికి తగ్గి.. 532 రోజుల కనిష్ఠానికి చేరింది.
దేశంలో రోజువారీ కేసులు వరుసగా 44వ రోజు 20 వేల కంటే తక్కువగా నమోదయ్యాయి. 147 రోజులుగా రోజువారీ వైరస్ కేసులు 50 వేలకు దిగువన నమోదవుతున్నాయి. దీంతో గచిడిన 48 రోజులుగా పాజిటివిటీ రేటు 2 శాతానికి(0.98) దిగువన నమోదవుతోంది. 58 రోజులుగా వారాంత (వీక్లీ) పాజిటివిటీ రేటు 2 శాతం (0.94శాతం) కంటే తక్కువగా ఉంది.
- మొత్తం కేసులు : 3,45,10,413
- మొత్తం మరణాలు : 4,65,662
- యాక్టివ్ కేసులు : 1,22,714
- కోలుకున్నవారు : 3,39,22,037
టీకాల పంపిణీ..
దేశంలో కొవిడ్ టీకా పంపిణీ (Vaccination in India) జోరుగా కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 67,25,970 డోసులు అందించారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,16,50,55,210కి చేరింది.
పరీక్షలు
భారత్‌లో నవంబరు 20న 10,74,099 కొవిడ్ టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఫలితంగా మొత్తం కరోనా పరీక్షల సంఖ్య(India Covid test report) 63,16,49,378కి చేరింది.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్యలో (coronavirus worldwide) తగ్గుదల నమోదైంది. తాజాగా 4,81,223 మంది కరోనా (Corona update) బారిన పడ్డారు. కొవిడ్ ధాటికి మరో 5,669 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 25,74,26,494కు చేరగా.. మొత్తం మరణాల సంఖ్య 51,63,390కి పెరిగింది.
వివిధ దేశాల్లో కొత్త కేసులు..
- అమెరికాలో కొవిడ్ కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 36,633 మంది కరోనా బారిన పడ్డారు. మరో 404 మంది మృతి చెందారు.
- జర్మనీలో కొత్తగా మరో 48,245 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 154 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రష్యాలో మరో 37,120 మందికి కరోనా సోకింది. కొత్తగా 1,254 మంది చనిపోయారు.
- బ్రిటన్‌లో కొత్తగా 40,941 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. మరో 150 మంది మరణించారు.
- టర్కీలో మరో 23,347 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 201 మంది చనిపోయారు.
ఇవీ చూడండి: