India China Border Talks Latest Update : వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తలు కొనసాగుతున్న వేళ భారత్, చైనా మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లోని నియంత్రణ రేఖ వెంట బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయని విదేశాంగశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పశ్చిమ సెక్టార్‌లో ఎల్‌ఏసీతో పాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంపై లోతైన చర్యలు జరిగాయని తెలిపింది. పెండింగ్‌లో ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చైనా అంగీకరించిందని తెలిపింది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతను కొనసాగించేందుకు ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చినట్లు వెల్లడించింది. దెప్సాంగ్, దెమ్‌చోక్ సహా ఇతర ప్రాంతాల నుంచి దళాలను త్వరగా ఉపసంహరించాలని చైనాపై ఒత్తిడి తెచ్చామని తెలిపింది.
India China Relations : "ఇరువర్గాల మధ్య సానుకూల, నిర్మాణాత్మక, లోతైన చర్చలు జరిగాయి. ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలకు అనుగుణంగా సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై ఇరు పక్షాల మధ్య అభిప్రాయ మార్పిడి జరిగింది. సరిహద్దులో మిగిలిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి సైనిక మరియు దౌత్య మార్గాల ద్వారా చర్చల వేగాన్ని కొనసాగించడానికి ఇరువర్గాలు అంగీకరించుకున్నాయి. అప్పటివరకు.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతను నెలకొల్పేందుకు ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి."
-భారత విదేశాంగ శాఖ
India China Border News :
19వ రౌండ్ చర్చలకు లెఫ్టినెంట్ జనరల్ రషీమ్ బాలి, చైనా వైపు దక్షిణ షిన్‌జియాంగ్ మిలటరీ డిస్ట్రిక్ట్ చీఫ్ నాయకత్వం వహించారు. భారత్ వైపున ఉన్న చుషుల్-మోల్డోలో ఈ చర్చలు జరిగాయి. ఆగస్టు 13- 14న ఈ చర్చలు నిర్వహించారు. సరిహద్దు అంశంపై ఇరువర్గాల మధ్య ఉన్నతస్థాయి సైనిక చర్చలు వరుసగా రెండు రోజుల పాటు జరగడం ఇదే తొలిసారి. 18వ దఫా చర్చలు ఏప్రిల్ 23న జరగ్గా.. నాలుగు నెలల తరువాత మరోసారి చర్చలు నిర్వహించారు.
మూడేళ్లుగా సరిహద్దులో ఈ ప్రతిష్టంభన కొనసాగుతోంది. చైనా దళాలు దూకుడుగా ప్రవర్తిస్తూ బఫర్ జోన్లలోకి ప్రవేశించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొన్ని సైనిక పాయింట్ల వద్ద ఇరుదేశాల దళాలు ఘర్షణ పడుతున్నాయి. పలు ప్రాంతాల నుంచి ఇరుదేశాలు తమ బలగాలను ఉపసంహరించుకున్నప్పటి.. మరికొన్ని చోట్ల పూర్తి ఉపసంహరణ ఇంకా జరగలేదు.
లద్దాఖ్‌లో యుద్ధ ట్యాంకుల గర్జన.. సింధూ నదిని దాటి శత్రువులపై దాడి!
'సరిహద్దులో శాంతి లేకుంటే సత్సంబంధాలు కష్టమే'... చైనాకు రాజ్‌నాథ్ గట్టి సందేశం