ETV Bharat / bharat

'భారత్​-బంగ్లా​ బంధంలో మోదీ పర్యటన కీలకం'

author img

By

Published : Mar 26, 2021, 8:19 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్​ పర్యటనపై మాజీ హైకమిషనర్​ పినక్ రంజన్ చక్రవర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ పర్యటన ఇరు దేశాల బంధంలో కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈటీవీ భారత్​తో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Modi bangladesh visit, ప్రధాని మోదీ బంగ్లాదేశ్ పర్యటన
pinak ranjan chakravarthy

ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్​ పర్యటనతో భారత్..​ పొరుగు దేశాలకే తొలి ప్రాధాన్యం ఇస్తుందనే విషయం స్పష్టమవుతోందని మాజీ హైకమిషనర్ పినక్​ రంజన్​ చక్రవర్తి అన్నారు. పొరుగు దేశాలకు ప్రాధాన్యంపై మోదీ అనేక సార్లు ప్రస్తావించారని.. ఈ మేరకు కరోనా తర్వాత తొలి విదేశీ పర్యటనకు బంగ్లాదేశ్​ను ఎన్నుకున్నారని తెలిపారు. ప్రధాని పర్యటన భారత్-​బంగ్లాదేశ్​ బంధాలలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈటీవీ భారత్​కు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ​

భారత్ మాజీ హైకమిషనర్​తో ఇంటర్వ్యూ

భారత్​ నుంచి కొవిడ్​ వ్యాక్సిన్లు పొందిన తొలి దేశం బంగ్లాదేశ్​ అని రంజన్ ఉద్ఘాటించారు. ప్రధాని పర్యటన భారత్​ బంగ్లాదేశ్​ బంధం మెరుగైన స్థితిలో ఉందనడానికి ఉదాహరణ అని అన్నారు. దక్షిణాసియా దేశాలకు ఇరు దేశాల బంధం ఉదాహరణగా నిలుస్తుందని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇరు దేశాలు ఎన్నో అంశాల్లో కలిసి కృషి చేయవచ్చని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి : గాంధీ శాంతి పురస్కరాన్ని రెహ్నాకు అందించిన మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.