సమస్యను పరిష్కరించుకోవాలని రైతు సంఘాలు నిర్ణయించుకుంటేనే.. నిరసనలపై ఏర్పడిన ప్రతిష్టంభన తొలుగుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. పరిష్కారం కోసం ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోందని, రైతులతో చర్చలకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అసోంలో ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకుని మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చేరుకున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"అసోంలో ప్రస్తుత భాజపా ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోంది. సుదీర్ఘ కాలం తర్వాత అసోం ప్రజలు శాంతి, అభివృద్ధి, భద్రతను పొందారు. మరోసారి ఆ రాష్ట్రంలో భాజపానే అధికారంలోకి వస్తుంది." అని తోమర్ ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : నిలకడగా రాష్ట్రపతి ఆరోగ్యం-30న శస్త్రచికిత్స