ETV Bharat / bharat

పీహెచ్​డీ దళిత విద్యార్థినిపై అత్యాచారం.. నలుగురు కలిసి రెండేళ్లు..

IIT-M Dalit Scholar Sexually Assault: ఐఐటీ మద్రాస్​ పీహెచ్​డీ దళిత విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసు జాప్యంపై ఇండియా డెమొక్రటిక్ ఉమెన్ అసోసియేషన్(ఏఐడీడబ్ల్యూఏ) స్పందించింది. కేసును సీబీ-సీఐడీకి బదిలీ చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది.

IIT-M Dalit Scholar Sexually Assaulted
లైంగిక వేధింపులు
author img

By

Published : Mar 27, 2022, 11:40 AM IST

IIT-M Dalit Scholar Sexually Assault: ఐఐటీ మద్రాస్​లో పీహెచ్​డీ చదువుతున్న దళిత విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసును సీబీ-సీఐడీకి బదిలీ చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆల్​ ఇండియా డెమొక్రటిక్ ఉమెన్ అసోసియేషన్(ఏఐడీడబ్ల్యూఏ) కోరింది. 'ఐఐటీ మద్రాస్​లో బంగాల్​కు చెందిన దళిత విద్యార్థినిపై నలుగురు తోటి విద్యార్థులు రెండేళ్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆ దృశ్యాలను వీడియో తీసి బెదిరించారు. ఈ అంశంపై ప్రొఫెసర్​కు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు.' అని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఏఐడీడబ్ల్యూఏ జనరల్ సెక్రటరీ పీ సుగాంతీ తెలిపారు.

'బాధితురాలు ఐఐటీ పరీక్షల్లో తప్పి, మానసికంగా కుంగిపోయింది. ఎవరూ సహాయం చేయకపోయేసరికి ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. క్యాంపస్ ఫిర్యాదుల కమిటీకి 2020లో ఫిర్యాదు చేసినప్పటికీ.. వారు దర్యాప్తును ఇప్పటికీ పూర్తి చేయలేదు. వేధింపులపై మార్చి 2021న మైలపోర్ మహిళా పోలీస్ స్టేషన్​లో కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది. అక్కడ కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. బాధితురాలుని స్టేషన్​ నుంచి బయటకు లాగేశారు.' అని చెప్పారు సుగాంతీ. క్యాంపస్ అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఈ కేసుపై విచారణ జరిపి పూర్తి నివేదికను సమర్పించాలని కోరారు. దోషులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

షెల్టర్ హోమ్​లో..: దిల్లీ షెల్టర్ హోమ్​లో ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సబ్జీ మండీలోని దుసిబ్ షెల్టర్ హోమ్స్​లో ఈ ఘటన జరిగింది. దిల్లీ అర్బన్​ షెల్టర్​ ఇంప్రూమెంట్ బోర్డు ఈ షెల్టర్ హోమ్స్​ను నిర్వహిస్తోంది. ఆశ్రయ్​ అధికార్ అభియాన్ అనే స్వచ్ఛంద సంస్థ దీని బాధ్యతలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో షెల్టర్ హోమ్​లో జనవరి 8న ఇద్దరు వ్యక్తులు తనపై అత్యాచారం చేశారని ఓ మహిళా సేవకురాలు ఆరోపించింది. ఓ అధికారి కూడా ఇందులో పాలుపంచుకున్నారని షల్టర్ హోమ్​ డైరెక్టర్​కు ఫిర్యాదు చేసింది. అయితే.. తనను హోమ్​ నుంచి బయటకు లాగేసి.. బెదిరించారని మహిళ ఆరోపించింది.

జనవరి 23న ఇచ్చిన ఫిర్యాదులో ఓ దివ్యాంగురాలిపై కూడా అత్యాచారం చేశారని పేర్కొంది. ఈ మొత్తం విషయాన్ని మహిళా కమిషన్​కు ఫిర్యాదు చేసింది బాధితురాలు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దిల్లీ మహిళా కమిషన్ సభ్యురాలు స్వాతి మలివాల్.. షెల్టర్ హోమ్​ను సందర్శించారు.

ఇదీ చదవండి: 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్​ రేప్​.. నిందితుల్లో ఆ ఎమ్మెల్యే కుమారుడు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.