ఐఐటీ గువాహటిలో తోటి విద్యార్థినిపై.. ఓ విద్యార్థి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై అమీన్గావ్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు.
ఏం జరిగింది?
మార్చి 28 రాత్రి హోలీ సందర్భంగా క్యాంపస్లో సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సమయంలో కెమిస్ట్రీ విభాగానికి చెందిన ఉస్తాద్ ఖదమ్.. తోటి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాలేజీ హాస్టల్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న విద్యార్థినిని హాస్టల్ యాజమాన్యం ఆసుపత్రికి తరలించిందని చెప్పారు.
నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి : ఆసుపత్రిలో అగ్నిప్రమాదం- ముగ్గురు సజీవదహనం!