నిరుద్యోగులకు నిరాశ. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీ(IBPS Clerk Recruitment 2021) ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది ఐబీపీఎస్(ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సెనల్ సెలక్షన్). అనివార్య కారణాల వల్ల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది.
తదుపరి వివరాల కోసం తమ వెబ్సైట్(ibps.in)ను పరిశీలించాలని ఐబీపీఎస్ స్పష్టం చేసింది.
"క్లర్క్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించాల్సిన ప్రాథమిక, మెయిన్స్ పరీక్షల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాము."
- ఐబీపీఎస్.
మొత్తం 5,830 క్లర్క్ పోస్టులకు ఆగస్టు చివర్లో ప్రాథమిక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఇటీవలే నోటిఫికేషన్‌ను జారీ చేసింది ఐబీపీఎస్. ఇంతలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు పేర్కొంది.
ఇదీ చూడండి:- ఐఓసీఎల్‌లో ఉద్యోగ అవకాశాలు- వీరే అర్హులు!