బిహార్‌లో బేతియాలోని విషాదం జరిగింది. పులి దాడిలో భార్యాభర్తలు మృతి చెందిగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఎప్పడు ఎటునుంచి పులి దాడిచేస్తుందోనని స్థానికులు భయపడుతున్నారు.
అక్లూ మహతో, రిక్కా దేవీ దంపతులది పర్సౌనీ గ్రామం. భోజనం చేసి రోజూ లాగే శుక్రవారం రాత్రి పది గంటలకు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. పొలంలో వారితో పాటు సొఖా మాంఝీ ఉన్నారు. పొదల చాటున మాటువేసి ఉన్న పులి ఒక్కసారిగా రిక్కాదేవిపై దూకి ఆమె మెడను కొరికింది. ఆమెను కాపాడదానికి భర్త అక్లూ, సొఖా ప్రయత్నించగా వారిపైనా పులి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆ ముగ్గురినీ స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
రిక్కా దేవీ దంపతులు చికిత్స పొందుతూ మృతి చెందారు. సొఖా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృత దేహాలను శవపరీక్షకు పంపించామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
వరుసగా పులి దాడులు
గౌన్హా బ్లాంక్‌లో రోజూ పులి సంచరిస్తుండటం వల్ల భయపడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. ఫిబ్రవరి 11న కూడా ఖైర్తీయా గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై దాడి చేసిందని తెలిపారు. అంతేకాకుండా ఫిబ్రవరి 9 న హర్కత్వా గ్రామానికి చెందిన ఛత్రపతి దేవీ తన మేకను మేపుతుండగా పులి దాడి చేసి చంపేసిందని వెల్లడించారు.
అయితే ఆ పులి ముసలిదని, గ్రామాల్లోకొచ్చి పెంపుడు జంతువులపై దాడికి పాల్పడుతోందని ముంగ్రహ అటవీ శాఖ అధికారి సునీల్ కుమార్ పఠాక్ తెలిపారు. త్వరలోనే పులిని పట్టుకుని జంతుశాలకు పంపిస్తామని అన్నారు.
ఇదీ చూడండి: 'ఆ 2.5 లక్షల మందిపై కేసులు ఎత్తేస్తున్నాం'