How To Protect From ATM Fraud: టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది మోసాలు కూడా పెరుగుతున్నాయి. నేరగాళ్లు రకరకాల మార్గాలను ఎంచుకుని సామాన్యుడి నుంచి సంపన్నుడు వరకూ దాడులు చేస్తూ.. లక్షలకు లక్షలు కాజేస్తున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా బ్యాంకు ఏటీఎం కార్డుల ద్వారా మోసాలకు పాల్పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగింది. వివిధ టెక్నిక్‌లను వినియోగించి నేరగాళ్లు.. వ్యక్తుల ఏటీఎం కార్డు వివరాలు, పిన్ వంటివి సేకరిస్తూ.. ఖాతాలను గుల్ల చేసేస్తున్నారు. వివరాలు, పిన్ వంటివి సేకరించి వినియోగదారుల ఖాతాలు గుల్ల చేసేస్తున్నారు. అయితే, ఏటీఎం కార్డ్ మోసాల నుంచి మిమ్మల్ని మనం ఎలా రక్షించుకోవాలి..?, అందుకు ఏమైనా మార్గాలు ఉన్నాయా..?, నేరగాళ్లు ఎన్ని రకాలుగా ఏటీఎం కార్డ్ మోసాలు చేస్తారు..? అనే విషయాలను ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం.
"షోల్డర్ సర్ఫింగ్" ఏమిటి..?
What is shoulder surfing?: "షోల్డర్ సర్ఫింగ్" అనేది సున్నితమైన సమాచారాన్ని, వ్యక్తిగత గుర్తింపు సంఖ్యలను (పిన్‌లు) దొంగిలించడానికి నేరస్థులు ఉపయోగించే పద్ధతి. ఈ పద్దతి ద్వారా ATM లేదా పాయింట్-ఆఫ్-సేల్ టెర్మినల్ వంటి కీప్యాడ్‌లో ఎవరైనా పిన్‌ను నమోదు చేస్తున్నప్పుడు దాన్ని గమనిస్తారు. "షోల్డర్ సర్ఫింగ్"తో దొంగలు ప్రజల ఏటీఎం కార్డ్‌లను దొంగిలించి, వారి బ్యాంక్ ఖాతాల నుండి అనధికారికంగా సొమ్మును విత్‌డ్రా చేస్తారు. అంతేకాదు, ATM కార్డ్ నంబర్ సీక్వెన్స్‌తో పాటు CVV నంబర్‌ను దొంగిలించి.. బ్యాంక్ ఖాతా వివరాలను, వ్యక్తి చిరునామా కూడా తెలుసుకుంటారు.
ATM FRAUDS: వాళ్లు డబ్బు డ్రా చేస్తారు... కానీ వారి అకౌంట్లో నగదు కట్ కాదు!
కార్డ్ స్కిమ్మింగ్ (Card Skimming): ఒక వ్యక్తి ATMని ఉపయోగించినప్పుడు మెషీన్‌లో ఉన్న స్కిమ్మింగ్ పరికరం ఆ ఏటీఎం కార్డ్ నంబర్, పిన్‌తో సహా కార్డ్ సమాచారాన్ని సేకరిస్తుంది. అప్పుడు మోసగాళ్ళు మోసపూరిత కార్డ్‌లను తయారు చేసి, ఆన్‌లైన్‌లో లావాదేవీలను నిర్వహించే డేటాను ఉపయోగిస్తారు. ఆ తర్వాత కార్డ్ నుంచి సొమ్మును దోచేస్తారు.
కార్డ్ ట్రాపింగ్ (Card Trapping): నేరస్థులు వినియోగదారు కార్డ్‌ను క్యాప్చర్ చేయడానికి ATM కార్డ్ స్లాట్‌ను తారుమారు చేస్తారు. వినియోగదారు తమ కార్డును తిరిగి తీసుకోకుండా ATM సెంటర్ నుంచి బయటకు వెళ్లిన మరుక్షణమే నేరస్థుడు నగదును కాజేస్తారు.
ఫిషింగ్ (Card Fishing): స్కామర్‌లు పేరున్న బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ ప్రతినిధులుగా నటిస్తూ.. తప్పుడు మెయిల్స్, టెక్స్ట్‌లు పంపుతారు. ఫోన్ కాల్ చేస్తారు. ఇలా.. ATM కార్డ్ నంబర్‌లతో సహా వారి వ్యక్తిగత సమాచారం పొందుతారు. ఆ తర్వాత సొమ్ము కాజేస్తారు.
Bhadrachalam: 'తాతా ఏటీఎంలో నుంచి నేను డబ్బు తీసిస్తా ఆగు'.. అంటూ
షోల్డర్ సర్ఫింగ్ నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి?
How to protect yourself from shoulder surfing?:
ATMలో అపరిచిత వ్యక్తి నుండి సహాయానికి ఎప్పుడూ అంగీకరించవద్దు.
డబ్బును విత్‌డ్రా చేస్తున్న సమయంలో మీ స్క్రీన్‌ని మిగతవారు వీక్షించకుండా ప్రయత్నించండి.
ATMలో మీ PINని నమోదు చేసినప్పుడు మీ చేతితో స్క్రీన్, కీప్యాడ్‌ను కవర్ చేయండి.
ATM గదిలో ఏవైనా అనుమానాస్పద కెమెరాలు ఉన్నాయేమో.. చుట్టూ చూసుకోండి.
మీ లావాదేవీ పూర్తయ్యే వరకు మీరు పూర్తిగా లాగ్ అవుట్ అయ్యే వరకు ATM వద్దే ఉండండి.
మీరు ముందుగానే బయలుదేరినట్లయితే.. తర్వాత వచ్చే వ్యక్తి మీ ఖాతాను యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది.
మీ ఖాతా బ్యాలెన్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను నిశితంగా గమనించండి.
ఏవైనా అసమానతలు ఉంటే వెంటనే మీ బ్యాంక్‌కు తెలియజేయండి.