Pan - Aadhaar Status : ఆదాయ పన్ను వ్యవహారాలను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఇందులో ప్రధానమైన సంస్కరణే.. పాన్ కార్డు-ఆధార్ కార్డు లింక్ చేయడం. ఈ పని వెంటనే చేయండి అంటూ.. ఇప్పటి వరకు పలుమార్లు కోరింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT). ఆ తర్వాత గడువులు విధిస్తూ.. వాటిని పొడిగిస్తూ వచ్చింది. చిట్ట చివరగా.. ఫైన్‌తో ఈ గడువు 2023 జూన్ 30తో ముగిసిపోయింది. అయినప్పటికీ ఇంకా ఆధార్ తో లింక్ చేయని పాన్ కార్డులు ఏకంగా 20 శాతం ఉన్నాయట! మరి, అందులో మీరున్నారా..? లింక్ చేయకపోతే ఏమవుతుంది? ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాలి? వంటి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.
Central Board of Director Taxes (CBDT) : 2022లో పాన్-ఆధార్ లింక్ చేసుకోవాలని సీబీడీటీ సూచించింది. ఇందుకోసం 31 మార్చి 2022 వరకు గడువు విధించింది. ఈ సమయంలో ఉచితంగానే లింక్ చేసుకోవచ్చని ప్రకటించింది. కొంత మంది లింక్ చేసుకున్నారు. దీంతో.. ఆ గడువును CBDT పొడిగించింది. 500 రూపాయల ఫైన్ తో లింక్ చేసుకోవచ్చంటూ.. 30 జూన్ 2022 వరకు అవకాశం ఇచ్చింది. అప్పటికీ.. అందరూ లింక్ చేసుకోకపోవడంతో.. ఈ సారి 1000 రూపాయల ఫైన్ తో 2023 జూన్ 30 వరకు ఛాన్స్ ఇచ్చింది.
ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఇప్పుడు ఆ గడువు కూడా ముగిసిపోయి నెల పదిహేను రోజులవుతోంది. అయితే.. ఇప్పటికీ ఆధార్ - పాన్ తో లింక్ చేసుకోని వారి సంఖ్య భారీగానే ఉందట. 2023 జూన్ 30 గడువు ముగిసిన (Pan Aadhar Link Deadline Ended) తర్వాత లెక్కలు చూస్తే.. ఏకంగా 20 శాతానికి పాన్ కార్డులు లింక్ కాలేదట.
మరి, పాన్ తో ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుంది అంటే.. ఆ కార్డు పనిచేయకుండా పోతుంది. అంటే.. ఇప్పటి వరకూ ఏ అవసరాలకోసం పాన్ కార్డును వినియోగించారో.. ఇకపై అలాంటి అవసరాలకు లింక్ చేయని పాన్ కార్డును ఉపయోగించలేరన్నమాట. ఇలాంటి వారు మళ్లీ కొత్త పాన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ.. అదేం మొబైల్ సిమ్ కార్డు కాదు.. వెంటనే ఇవ్వడానికి. ఒక పాన్ కార్డు రద్దైన తర్వాత మరొకటి మంజూరు చేయాలంటే చాలా తతంగమే ఉంటుంది. అందుకే.. అలర్ట్ గా ఉండాలని కేంద్రం పలుమార్లు సూచనలు చేసింది.
గడువులోపు ఆ పని చేయకుంటే మీ ఎస్బీఐ అకౌంట్ క్లోజ్!
మీరు పాన్-ఆధార్ లింక్ చేశారా? చేశామని ధీమాగా ఉండకండి. ఒక్కోసారి పొరపాట్లు జరగొచ్చు. అందుకే.. మరోసారి చెక్ చేసుకోండి. ఇందుకోసం.. ఇన్కమ్ ట్యాక్స్ e-ఫైలింగ్ వెబ్‌సైట్ (incometax.gov.in)లోనికి వెళ్లి, "Link Aadhar Status"పై క్లిక్ చేస్తే.. వెంటనే తేలిపోతుంది. అక్కడిదాకా వెళ్లకుండా.. ఈ లింక్ మీద https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status క్లిక్ చేసినా సరిపోతుంది.
ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత.. మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతుంది. ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పక్కనే ఉన్న "View Link Aadhar Status" ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీరు లింక్ చేశారా లేదా అనే సమాధానాన్ని.. ఓ డైలాగ్ బాక్స్‌లో చూపిస్తుంది. పాన్ కార్డుతో ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు.. అది ఉపయోగంలో లేదని తెలిస్తే.. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే.. ఓసారి చెక్ చేసుకోండి.