How to Book Train Tatkal Tickets in Telugu : ఒకప్పుడు ట్రైన్ టికెట్ల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండేవాళ్లం. రిజర్వేషన్ టికెట్ల కోసం.. ఓ ఫారం నింపి టికెట్స్ బుక్ చేసుకునే వాళ్లం. కానీ.. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు క్షణాల్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. దీనికోసం రైల్వే శాఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) అనే ప్రత్యేక పోర్టల్‌ను తీసుకొచ్చింది. ఇది వచ్చాక చాలా మంది సులువుగా, వేగంగా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అయితే.. టికెట్లు దొరకని వారికి.. "తత్కాల్ టికెట్లు(Tatkal Tickets) " అంటూ మరో ఆప్షన్ తీసుకొచ్చింది. ఈ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం.
IRCTC Tatkal Tickets Booking Times : ఐఆర్సీటీసీ అందిస్తున్న తత్కాల్ టికెట్లు వెంటనే బుక్ చేసుకోవడానికి లేదు. మీరు ప్రయాణం చేసే ఒక రోజు ముందు మాత్రమే వీటిని బుక్ చేసుకోవాలి. అలాగే ఏసీ క్లాస్‌లకు సంబంధించిన టికెట్ల బుకింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమయితే.. నాన్ ఏసీ క్లాస్‌లకు చెందిన టికెట్ల బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. వీటిని వెబ్‌సైట్, మ్యాజిక్ ఆటోఫిల్, పేటీఎం(Paytm) ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటును ఐఆర్సీటీసీ కల్పిస్తోంది.
How to Book Tatkal Train Ticket in IRCTC Website :
IRCTC వెబ్‌సైట్ ద్వారా తత్కాల్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే..?
- మొదట మీరు IRCTC వెబ్‌సైట్ irctc.co.inని సందర్శించాలి.
- మీ వివరాలతో వ్యక్తిగత వినియోగదారుగా నమోదు చేసుకోవాలి.
- ఆ తర్వాత మీ లాగిన్ వివరాలను ఉపయోగించి మీ IRCTC ఖాతాకు లాగిన్ అవ్వాలి.
- అనంతరం మీ బోర్డింగ్, గమ్యస్థాన నగరాలను ఎంచుకొని మీరు వెళ్లాల్సిన రైళ్ల కోసం సెర్చ్ చేయాలి.
- అలాగే ఈ-టికెట్‌ను సెలెక్ట్ చేసుకుని.. ఆపై 'Submit' బటన్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీరు అందుబాటులో ఉన్న అన్ని రైళ్ల జాబితా పేజీకి వెళతారు.
- సంబంధిత రేడియో బటన్‌పై క్లిక్ చేసి మీరు ప్రయాణించాల్సిన కోటాను 'తత్కాల్'గా ఎంచుకోవాలి.
- ఆ తర్వాత ట్రైన్ కనుగొని.. జాబితాలో మీకు నచ్చిన తరగతిపై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీరు ఎంచుకున్న రైలులో సీట్లు ఉంటే "Book Now"అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు ప్రయాణికులకు సంబంధించి అడిగిన వివరాలన్నీ పూరించాలి. ఆపై 'Submit' బటన్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం చెల్లింపుల పోర్టల్‌లో మీ సౌకర్యానికి అనుగుణంగా మనీ చెల్లించాలి.
- టికెట్‌కు సంబంధించిన చెల్లింపు పూర్తి చేసిన తర్వాత మీ టికెట్ ERS Formatలో కనిపిస్తోంది.
- అప్పుడు దిగువన ఉన్న 'Print ERS' బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ ట్రైన్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
How to Cancel IRCTC Train Tickets Online : ఐఆర్సీటీసీలో.. ట్రైన్ టికెట్స్ రద్దు చేసుకోవడం ఎలా..?
IRCTC మ్యాజిక్ ఆటోఫిల్ ద్వారా తత్కాల్ టికెట్ బుక్ చేసుకోండిలా..
How to Book Tatkal Train Ticket Use Magic AutoFill Online :
- IRCTC వెబ్‌సైట్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
- తర్వాత.. బ్రౌజర్‌లో మ్యాజిక్ ఆటోఫిల్ ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
- ఈ మ్యాజిక్ ఆటోఫిల్ ఎక్స్‌టెన్షన్‌లో.. మీ వ్యక్తిగత వివరాలు, బుకింగ్ డీటెయిల్ ఎంటర్ చేయండి.
- IRCTC వెబ్‌సైట్‌కి లాగిన్ చేసి.. "తత్కాల్" ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- రైలు, ప్రయాణించే క్లాస్ ఎంచుకోండి.
- "Book Now" బటన్ పై క్లిక్ చేయండి.
- ఈ Magic AutoFill మీ వ్యక్తిగత వివరాలన్నీ ఆటోమేటిక్‌గా దానంతట అదే ఫిల్ చేస్తుంది.
- టికెట్ బుక్ చేసుకోవడానికి "Submit" బటన్ పై క్లిక్ చేయండి.
How to Book Tatkal Train Ticket Use Paytm Online :
Paytm ద్వారా తత్కాల్ టికెట్ బుక్ ఇలా..
- మొదట మీ ఫోన్లో Paytm యాప్ ఓపెన్ చేయాలి.
- అనంతరం హోమ్‌పేజీలో "Train Tickets" ఎంపికపై క్లిక్ చేయాలి.
- అప్పుడు From/To ఫీల్డ్‌లను ఎంచుకుని "Show Trains"పై క్లిక్ చేయాలి.
- మీరు ప్రయాణించాలనుకున్న రైలుపై క్లిక్ చేసి "Book Now"పై క్లిక్ చేయాలి.
- అనంతరం తత్కాల్ కోటా ఆప్షన్‌ను ఎంచుకుని, వివరాలను పూరించాలి.
- ఆ తర్వాత 'make Payment' పై క్లిక్ చేసి చెల్లింపులు చేయాలి.
- ఇంటర్నెట్ బ్యాంకింగ్/క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్/Paytm వాలెట్ మొదలైన వాటి ద్వారా ఆన్‌లైన్ చెల్లింపు చేయవచ్చు.
- దీంతో.. మీ తత్కాల్ రైలు టికెట్ బుక్ అవుతుంది.
Tatkal Tickets Cancellation Rules : అయితే మీరు ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. మీరు బుక్ చేసుకున్న సాధారణ రైలు టికెట్ల(Train Tickets) మాదిరిగా.. ఈ తత్కాల్ ట్రైన్ టికెట్లను క్యాన్సిల్ చేసుకోవడం కుదరదు. కేవలం రెండు సందర్భాల్లోనే టికెట్ క్యాన్సిల్ చేసుకోగలరు. రైలు బయల్దేరాల్సిన సమయానికన్నా.. మూడు గంటలపైన ఆలస్యమైతే.. తత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒక్కోసారి అనివార్య కారణాలతో ట్రైన్ దారి మళ్లిస్తారు. ఇలాంటి సమయంలో కూడా ట్రైన్ టికెట్ రద్దు చేసుకోవచ్చు. డబ్బులు తిరిగి చెల్లిస్తారు.
రైలు ప్రయాణం వాయిదా పడిందా? ఇలా చేస్తే క్యాన్సిలేషన్ ఛార్జీలు ఉండవ్!
IRCTCలో రైలు టికెట్స్ బుక్ అవ్వట్లేదా.. అమెజాన్, పేటీఎంల్లో ట్రై చేయండి!