Horoscope Today : ఈ రోజు (జులై 30) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మీరు మీ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. లేదంటే అది మీ పనిని మాత్రమేగాక మీ సంబంధాలను కూడా పాడుచేస్తుంది. ఉద్రిక్తత, శత్రుత్వం.. మీరు మీ పనిపై దృష్టి పెట్టకుండా చేస్తాయి. ఈ రోజు మీరు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఒక ధార్మిక ప్రదేశాన్ని దర్శిస్తారు లేదా ఒక శుభప్రదమైన కార్యక్రమానికి ఆహ్వానం అందుకుంటారు.
పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు కష్టపడి పనిచేసినా.. అంత త్వరగా విజయం లభించదు. ఈ రోజు మీరు కాస్త నీరసంగా ఉంటారు. కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి కచ్చితంగా ఇది మంచి సమయం కాదు. మీ ప్రయాణంలో ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. మీరు తినే ఆహారం గురించి జాగ్రత్త వహించండి. వస్తు లాభాల వెంట పడకుండా, ఈ రోజు మీరు ధ్యానం, ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం మంచిది.
ఈ రోజు మీ రాశి ఫలితాల్లో భౌతిక సుఖాల్లో తృప్తి, ఆనందం ఉంది. మీరు అనుకోని వ్యక్తులను కలుసుకోవచ్చు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా విహారయాత్రలకు వెళ్ళి రావచ్చు. మీరు కొత్త బట్టల కోసం షాపింగ్‌కి వెళ్లవచ్చు. మీరు మన్మథుడి బాణఘాతానికి బాగానే తపిస్తుంటారు. శారీరకంగా మీ ఫిట్నెస్, సామాజికంగా మీ కీర్తి ప్రతిష్ఠలు అన్నీ చరమ స్థాయిలో ఉంటాయి. మీ జీవితం భాగస్వామితో ఏకాంతంగా సంతోషంగా గడుపుతారు.
మీకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు. అవి కొద్ది క్షణాలే కావచ్చు.. కానీ ఆనందప్రదమైనవి. మీరు ఈ రోజు పూర్తి చేసిన పనులకు మీకు ఈ రోజే మెప్పు లభిస్తుంది. శారీరకంగా ఈ రోజు మీరు ఫిట్‌గా ఉంటారు. మీ కుటుంబ సభ్యులతో చక్కని సమయం గడుపుతారు. ఉద్యోగస్తులకు కూడా ఈ రోజు చాలా మంచి రోజు. సబార్డినేట్స్ సహకరిస్తారు. మీరు మహిళా స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులన్నీ.. తిరిగి మీకు అనుకూలంగా మారుతాయి.
మీరు ఈ రోజు సంతోషంగా గడుపుతారు. మీ కల్పనా శక్తి వెయ్యింతలవుతుంది. ప్రకృతి పరంగా కవితలు రాసేందుకు తగిన ప్రేరణ ఉంటుంది. ప్రియమైనవారిని కలుసుకుని ఆనందిస్తారు. మీరు మీ పిల్లల ప్రోగ్రెస్ గురించి సమాచారం అందుకుంటారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. స్నేహితులను కలుసుకుంటారు. మహిళా స్నేహితుల నించి లబ్ధి ఉండవచ్చు. మీరు దాన సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఈ రోజు ప్రతికూలతతో నిండి ఉండవచ్చు. మీరు శారీరకంగా చెలాకీగా ఉండకపోవచ్చు. ఆందోళనలు మీ మనసును పీడించవచ్చు. మీ జీవిత భాగస్వామితో వాదనలు, ఘర్షణలకు చాలా అవకాశం ఉంది. మీ తల్లిగారి అనారోగ్యం మీకు ఆందోళన కలిగించవచ్చు. భూమి, ఆస్తికి సంబంధించిన విషయాలతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.
ఈ రోజు మీకు చాలా ప్రొడక్టివ్‌గా గడుస్తుంది. మీ సోదరులతోనూ, సంబంధీకులతోనూ మీరు స్నేహపూర్వకంగా ఉంటారు. ఒక తీర్థయాత్ర చేసే అవకాశం ఉంది. ఈ రోజు మీకు మంచి ఆర్థిక ఫలితాలు పొందే అవకాశం ఉంది. విదేశాల నుంచి శుభవార్త అందుకుంటారు. బయటి ప్రదేశాల్లో నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త ప్రదేశాలు తిరిగి వస్తారు. ఈ రోజు కొత్త కార్యక్రమాలు మొదలుపెట్టడానికి అనుకూలమైన రోజు. శారీరకంగానూ, మానసికంగానూ కూడా మీరు చెదరకుండా ఉంటారు. ఈ రోజు పెట్టుబడి పెట్టేవారికి బాగా లాభం కలిసివస్తుంది.
మీరు మీ ఇంట్లో సామరస్యంగా మెలగాలంటే మీ నాలుకను అదుపులో పెట్టుకోవాలి. మీ దురుసు ప్రవర్తనతో మీరు ఈ రోజు ఒకరిని బాధించవచ్చు. అందువలన, మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతికూలత మీ మనసును ఆవహించనివ్వడానికి అవకాశం ఇవ్వకూడదు. ఆరోగ్య సమస్యలకు అవకాశం ఉంది.
మీరు పుణ్యక్షేత్రాలను దర్శించడానికి సిద్దమవుతారు. ఈ రోజు మీరు చేద్దామనుకున్న పనులు చక్కగా పూర్తి చేస్తారు. ఈ రోజు మీరు శారీరకంగా మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు. అందువల్ల మీరు మీ మీద నమ్మకంతో ఉల్లాసంగా ఉంటారు. మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీరు ప్రేమించే వ్యక్తిని కలసి ఆనందంగా గడిపే అవకాశం ఉంది. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.
ఈ రోజు మీరు మతపరమైన ఆధ్యాత్మికమైన విషయాలపై దృష్టి సారిస్తారు. అందువల్ల కొంత డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కోర్టుకు సంబంధించిన విషయాల్లో మీరు శ్రద్ద వహించండి. కానీ మీరు ఈ రోజు ఏ పని మీద అంతగా ఇష్టత చూపలేరు. ఏ ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త తీసుకోండి.
మీ లక్ష్యాలను ఎలా సాధించాలనే దానిపై కసరత్తు చేస్తూ ఉంటారు, మీరు కష్టపడి పని చేస్తారు. మీకు కావాల్సిన మార్గాన్ని మీరు ఏర్పరుచుకుంటారు. అంతే కాదు మీరు కోరుకున్నది సాధించే సామర్థ్యం, శక్తి మీలో ఉందని తెలుసుకుంటారు.
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంది. కనుక మీకు అప్పగించిన పనులు మీరు గడువు కంటే ముందే పూర్తి చేస్తారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కుటుంబ వేడుకలు నెరవేరే సూచనలున్నాయి.