Horoscope Today : ఈ రోజు (జనవరి 10) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

ఏ పని తలపెట్టినా అది పూర్తయ్యే వరకు పట్టుదల వదలకండి. మనఃశాంతిని తగ్గించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. పరిచయం లేని వారిని తొందరగా నమ్మకండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రశాంతత కోసం ఈశ్వర సందర్శనం శుభప్రదం.

ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్యమైన పనిని బుద్ధిబలంతో విజయవంతంగా పూర్తి చేస్తారు. లక్ష్మీ సందర్శనం ఉత్తమం.

సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థిక లాభాలున్నాయి. పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తిచేస్తారు. శ్రీ రామ సందర్శనం మరింత మేలు చేస్తుంది.

తోటి వారితో సంతోషంగా గడుపుతారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. కొత్త వస్తువులను కొంటారు. ఆస్తిని వృద్ధిచేసే క్రమంలో సఫలీకృతులవుతారు. కీలక వ్యవహారాల్లో ప్రశాంతంగా వ్యవహరించాలి. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం.

స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం లాభించిన కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది.

మీ మీ రంగాల్లో ఆటుపోట్లు ఎదురవుతాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. రెచ్చగొట్టే వారు ఉన్నారు విచక్షణ జ్ఞానంతో ముందుకు సాగండి. మహాలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

మంచి ఫలితాలుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఒక మెట్టు పైకి ఎదుగుతారు. పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. ఇష్టదైవ సందర్శనం ఉత్తమం.

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు, నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఇష్టదైవ నామస్మరణ ద్వారా మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

మిశ్రమకాలం. మొదలుపెట్టిన పనిలో బాగా శ్రమించాలి. కీలక వ్యవహారాల్లో బుద్ధిబలం చాలా అవసరం. ఉత్సహం తగ్గకుండా ముందుకు సాగాలి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది.

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. శుభ భవిష్యత్తుకు బాటలువేస్తారు. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

దైవానుగ్రహంతో పనులు పూర్తవుతాయి. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. మహాలక్ష్మీ సందర్శనం శుభప్రదం.

కుటుంబసభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. శివ సందర్శనం శుభప్రదం.