Horoscope Today : ఈ రోజు (జనవరి20 ) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
![](https://assets.eenadu.net/article_img/mesham_2_4.jpg)
మీ మీ రంగాల్లో పనిభారం పెరుగుతుంది. ఒత్తిడిని జయించే విధంగా ముందుకుసాగాలి. కుటుంబసభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉండటం మంచిది. బంధు,మిత్రుల సహకారం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదవాలి.
![](https://assets.eenadu.net/article_img/vrushabam_5.jpg)
ప్రారంభించబోయే పని మీద ఏకాగ్రత నిలపాలి. ఉత్సాహంగా పనిచేస్తే అనుకున్నది దక్కుతుంది. కుటుంబంలో సభ్యుల సహకారం ఉంటుంది. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదివితే బాగుంటుంది.
![](https://assets.eenadu.net/article_img/midhunam_5.jpg)
మనోధైర్యం సదా కాపాడుతుంది. ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయండి. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.
![](https://assets.eenadu.net/article_img/karkatakam_2_4.jpg)
సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఆలోచించి ఖర్చుపెట్టాలి. సూర్యనారాయణమూర్తి ఆరాధన వల్ల మంచి జరుగుతుంది.
![](https://assets.eenadu.net/article_img/simham_1_4.jpg)
అలసట పెరగకుండా చూసుకోవాలి. ఆలోచనలే పెట్టుబడిగా లాభాలను అందుకుంటారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కలహాలకు దూరంగా ఉండండి. శ్రీదత్తాత్రేయ స్వామి సందర్శనం శుభప్రదం.
![](https://assets.eenadu.net/article_img/kanya_1_4.jpg)
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. బంధు,మిత్రులతో మాట్లాడేటప్పుడు వాదప్రతివాదాలు లేకుండా చూసుకోవాలి. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
![](https://assets.eenadu.net/article_img/tula_1_4.jpg)
మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. బంధు,మిత్రులను కలుస్తారు. కొన్ని కీలక వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహకారం ఉంటుంది. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.
![](https://assets.eenadu.net/article_img/vruschikam_6.jpg)
ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మనోధైర్యం కలిగి ఉంటారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. గురుశ్లోకం చదవాలి.
![](https://assets.eenadu.net/article_img/dhanussu_5.jpg)
అనుకున్న కార్యక్రమాన్ని పూర్తిచేస్తారు. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది.మితంగా ఖర్చుచేయాలి. శ్రమ కాస్త పెరుగుతుంది. కుటుంబసభ్యులతో ప్రేమగా మెలగాలి. ఈశ్వర నామాన్ని స్మరించండి.
![](https://assets.eenadu.net/article_img/makaram_3_3.jpg)
విజయసిద్ధి ఉంది. గమ్యం చేరే వరకు పట్టుదలను వీడకండి. ఎలాంటి సమస్యనైనా బుద్ధిబలంతో ఇట్టే పరిష్కరిస్తారు. అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. శ్రీనివాసుని సందర్శనం శక్తినిస్తుంది.
![](https://assets.eenadu.net/article_img/kumbam_1_5.jpg)
ప్రయత్నానుకూలత ఉంది. ఒక శుభవార్త వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహకారం ఉంటుంది. ఆరోగ్య,ఆర్థిక విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. గణపతి అష్టోత్తరం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.
![](https://assets.eenadu.net/article_img/meenam_2_5.jpg)
ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులను సులువుగా పూర్తిచేస్తారు. మీ మీ రంగాల్లో విజయం సొంతం అవుతుంది. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. ఇంటగెలిచి రచ్చగెలుస్తారు. శ్రీలక్ష్మీ అష్టోత్తరం చదివితే ఇంకా మంచిది.