
శ్రమతో కూడిన ఫలాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. నిరుత్సాహాన్ని విడనాడాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ మంచిది.

ప్రారంభించిన పనులను పూర్తిచేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. సాహసోపేతమైన విజయాలు ఉన్నాయి. శివ ఆరాధన శుభప్రదం.

ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. గొప్ప ఫలితాలను అందుకుంటారు. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.

దైవానుగ్రహంతో చేపట్టిన పనులను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. క్రమంగా అభివృద్ధి సాధిస్తారు. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. స్థిరమైన నిర్ణయాలతో మేలైన ఫలితాలు సాధిస్తారు. మానసిక ప్రశాంతతను కోల్పోకుండా ముందుకు సాగాలి. ఒత్తిడిని దరిచేరనీయకండి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభదాయకం.

భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. మనసు చెడ్డ పనుల మీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉంటాయి. తోటివారితో అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సూర్య ఆరాధన శుభప్రదం.

విజయసిద్ధి కలదు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులను మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తిచేయగలుగుతారు. మీమీ రంగాల్లో మీరు ఊహించని ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. శివాభిషేకం శ్రేయస్సును ఇస్తుంది.

ఆర్థికాంశాల్లో పురోగతి ఉంటుంది. ధర్మసిద్ధి కలదు. చేపట్టే పనుల్లో జాగ్రత్త అవసరం. బుద్ధిబలంతో ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. చక్కటి ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. శివ నామస్మరణ శుభప్రదం.

మిశ్రమకాలం. మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. చిన్న విషయాలు కూడా పెద్దవిగా కనిపిస్తాయి. సమస్య పెరుగుతుంది. మనోవిచారాన్ని కలిగించే ఘటనలు చోటుచేసుకుంటాయి. నవగ్రహ ధ్యానం శుభకరం.

మీ మీ రంగాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. ఎవరితోనూ విభేదించకండి. అష్టలక్ష్మిదేవి దర్శనం శుభప్రదం.

ఇష్టమైనవారితో కాలాన్ని గడుపుతారు. ఆర్థికంగా అనుకూలమైన సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవారాధన శుభదాయకం.

చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. దైవబలం ఉంది. కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో శుభఫలితాలు ఉన్నాయి. ఇష్టదేవతా దర్శనం శుభాలను చేకూరుస్తుంది.