Horoscope Today (08-07-2022): ఈ రోజు గ్రహబలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మ రుతువు; ఆషాఢ మాసం;
శుక్లపక్షం నవమి: మ. 1-11 తదుపరి దశమి చిత్త: ఉ. 8-08 తదుపరి స్వాతి
వర్జ్యం: మ.1-35 నుంచి 3-08 వరకు అమృత ఘడియలు: రా.10-56 నుంచి 12-29 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8-11 నుంచి 9-03 వరకు తిరిగి మ. 12-30 నుంచి 1-22 వరకు
రాహుకాలం: ఉ. 10-30 నుంచి 12.00 వరకు
సూర్యోదయం: ఉ.5.35, సూర్యాస్తమయం: సా.6.35
మీ కృషి ఫలిస్తుంది. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. లలితాదేవిని స్తుతించాలి.
మానసిక సౌఖ్యం కలదు. కొన్ని కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయాలి.
సత్ఫలితాలను అందుకుంటారు. కొన్ని విషయాల్లో మనోనిబ్బరం అవసరం. కొన్ని సందర్భాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీలను చేసేముందు నిపుణులను సంప్రదించడం ఉత్తమం. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభదాయకం.
గొప్ప సంకల్పబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు. భక్తి శ్రద్ధలతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అధికారుల సహకారం లభిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొందరి వ్యక్తుల ప్రవర్తన లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. ఆదిత్యహృదయం చదివితే మంచిది.
భోజన సౌఖ్యం కలదు. శరీర సౌఖ్యం ఉంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చెప్పుడు మాటలను వినకండి. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.
మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకట్రెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త. చంద్ర ధ్యానం శుభప్రదం.
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచి జరుగుతుంది.
మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలుంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. తొందరపాటు నిర్ణయాలతో ఇబ్బందులు పడతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠిస్తే శుభం కలుగుతుంది.
మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దుర్గా అష్టోత్తరం చదివితే మంచిది.
ఇదీ చూడండి: 'కాళీమాత'పై ఎంపీ కామెంట్స్.. దీదీ కీలక వ్యాఖ్యలు.. 'తప్పు చేశారు కానీ..!'