RCB Buys In Auction 2025 : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గత 17సీజన్లుగా టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ ఛాంపియన్‌గా నిలవలేకపోతోంది. దీంతో అత్యుత్తమ టీ20 ఆటగాళ్లపైనే ఆర్సీబీ కన్నేసింది. రూ.80+ కోట్ల పర్స్ వ్యాల్యూతో వేలంలోకి దిగిన ఆర్సీబీ, జట్టును బ్యాల్సెన్స్గా నిర్మించుకుంటుంది. ఈ క్రమంలోనే తాజా మెగా వేలంలో గెలుపు గుర్రాలుగా భావించిన ప్లేయర్లను కొనుగోలు చేసింది!
ఆర్సీబీ డెన్‌లో స్వింగ్ కింగ్
తొలి రోజు వేలంలో జోష్ హేజిల్‌వుడ్, లివింగ్ స్టోన్, ఫిల్ సాల్ట్‌ను కొనుగోలు చేసిన ఆర్సీబీ, సోమవారం స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యను దక్కించుకొని జట్టును మరింత పటిష్ఠంగా చేసుకుంది. తాజా వేలంలో భువనేశ్వర్ కుమార్ కోసం ముంబయి, లఖ్‌నవూ నుంచి పోటీ ఎదురైనప్పటికీ ఆర్సీబీ రూ.10.75 కోట్లు వెచ్చించి మరీ దక్కించుకుంది. పవర్ ప్లే, డెత్ ఓవర్లలో భువీకి స్పెషలిస్ట్ బౌలర్‌గా పేరుంది. భూవీ రాకతో ఆర్సీబీ పేస్ దళం భీకరంగా కనిపిస్తోంది. ఇక గతంలో కూడా భువీ ఆర్సీబీ జట్టుకు ఆడాడు.
క్వాలిటీ ఆల్‌రౌండర్
భువీ కంటే ముందు ఆర్సీబీ కృనాల్ పాండ్యను జట్టులోకి ఆహ్వానించింది. రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన కృనాల్‌ను ఆర్సీబీ రూ.5.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. మ్యాచ్‌లో కీలక సమయాల్లో బ్యాటింగ్, బౌలింగ్ చేయగల సామర్థ్యం పాండ్య సొంతం. గతంలో కృనాల్ మంబయి ఇండియన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్ల తరఫున రాణించాడు. దీంతో నలుగురు ఫాస్ట్, ముగ్గురు స్పిన్నర్లతో ఆర్సీబీ బౌలింగ్ విభాగం పటిష్ఠంగా కనిపిస్తోంది. అటు బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, లియామ్ లివింగ్ స్టోన్‌లాంటి స్టార్లతో బలంగా ఉంది.
" 𝙒𝙚'𝙫𝙚 𝙜𝙤𝙩 𝙖 𝙗𝙤𝙬𝙡𝙞𝙣𝙜 𝙪𝙣𝙞𝙩 𝙩𝙝𝙖𝙩'𝙨 𝙙𝙚𝙛𝙞𝙣𝙞𝙩𝙚𝙡𝙮 𝙫𝙚𝙧𝙮 𝙥𝙤𝙩𝙚𝙣𝙩." 🔥
— Royal Challengers Bengaluru (@RCBTweets) November 25, 2024
watch dk breaking down how the addition of ace indian bowler bhuvneshwar kumar strengthens our bowling attack, making it rock solid. 🙌#PlayBold #ನಮ್ಮRCB #IPLAuction… pic.twitter.com/TJxfwLFIYz
ఆర్సీబీ బౌలింగ్ విభాగం
- భువనేశ్వర్ కుమార్
- జోష్ హేజిల్‌వుడ్
- యశ్ దయాల్
- రసిక్ ధార్
- కృనాల్ పాండ్య
- సుయాశ్ శర్మ
- టిమ్ డేవిడ్
ఇప్పటివరకు వేలంలో కొన్నది వీరినే
జోష్ హేజిల్‌వుడ్ | రూ.12.50 కోట్లు |
ఫిల్ సాల్ట్ | రూ.11.50 కోట్లు |
జితేశ్ శర్మ | రూ. 11 కోట్లు |
లివింగ్స్టన్ | రూ. 8.75 కోట్లు |
రసిక్ | రూ. 6 కోట్లు |
సుయాశ్ శర్మ | రూ. 2.60 కోట్లు |
కృనాల్ పాండ్య | రూ.5.75 కోట్లు |
భువనేశ్వర్ కుమార్ | రూ.10.75 కోట్లు |
స్వప్నిల్ సింగ్ | రూ. 50 లక్షలు |
రొమారియో షెపర్డ్ | రూ. 1.5 కోట్లు |
టిమ్ డేవిడ్ | రూ. 3 కోట్లు |