ఈరోజు (11-10-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; ఆశ్వయుజ మాసం
శుక్లపక్షం పంచమి: ఉ. 6.43 తదుపరి షష్ఠి తె. 4.08 వరకు తదుపరి సప్తమి
జ్యేష్ఠ: సా. 5.55 తదుపరి మూల
వర్జ్యం: రా. 1.22 నుంచి 2.52 వరకు
అమృత ఘడియలు: ఉ.9.43 నుంచి 11.13 వరకు
దుర్ముహూర్తం: మ.12.10 నుంచి 12.57 వరకు తిరిగి మ.2.31 నుంచి 3.18 వరకు
రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు
సూర్యోదయం: ఉ.5-55, సూర్యాస్తమయం: సా.5-39
మేషం
గొప్ప భవిష్యత్తుకై మంచి ఆలోచనలను చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. శివారాధన శుభప్రదం.
వృషభం
ముఖ్య పనులను పూర్వాహ్ణం లోనే ప్రారంభించండి. పరిస్థితులకు తగ్గట్టు ముందుకుసాగాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. మాట విలువను కాపాడుకోవాలి. విష్ణు ఆరాధన శ్రేయస్కరం.
మిథునం
శ్రమ పెరుగుతుంది. అనుకున్నది సాధించేవరకు పట్టు వదలకండి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. విందువినోదాల్లో పాల్గొంటారు. సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాతే పనులను ప్రారంభిస్తే మంచిది. ఇష్టదైవారాధన శుభప్రదం.
కర్కాటకం
మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. గురు ఆరాధన మేలుచేస్తుంది.
సింహం
మంచికాలం. సమయాన్ని అభివృద్ధికై వినియోగించండి. మీ ప్రతిభతో అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.
కన్య
సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. ఇష్టులతో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. మహాలక్ష్మీ సందర్శనం శుభప్రదం.
తుల
అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనో విచారం కలగకుండా చూసుకోవాలి. కోపాన్ని దరిచేరనీయకండి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.
వృశ్చికం
వృత్తి, ఉద్యోగాల్లో విజయాలు సాధిస్తారు. ధనలాభం, మనఃసంతోషం కలుగుతాయి. ఓర్వలేనివారు ఉన్నారు జాగ్రత్త. సందర్భానుసారంగా ముందుకు సాగితే మేలు. అష్టలక్ష్మీ స్తుతి మంచిది.
ధనుస్సు
అనుకున్న ఫలితాలున్నాయి. శ్రమఫలిస్తుంది. ఆర్థిక విషయాలలో పర్వాలేదనిపిస్తుంది. కీలక పనులను మధ్యాహ్నం తరువాత చేయడం ఉత్తమం. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం.
మకరం
ఆప్తుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు. కొందరు మీ ఉత్సాహాన్ని భంగం చేయాలనీ చూస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శివారాధన శుభప్రదం.
కుంభం
ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తిచేయగలుగుతారు. కీర్తి పెరుగుతుంది. సంతోషంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు.లక్ష్మీ ఆరాధనా మంచిది.
మీనం
శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మనోబలం సడలకుండా చూసుకోవాలి. శివాష్టకం చదివితే మంచి జరుగుతుంది.