ETV Bharat / bharat

Horoscope Today (06-05-2022): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - ఈనాడు రాశి ఫలాలు

Horoscope Today (06-05-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE TODAY
ఈనాడు రాశి ఫలాలు
author img

By

Published : May 6, 2022, 5:10 AM IST

Horoscope Today(06-05-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత ఋతువు

వైశాఖమాసం; శుక్లపక్షం; పంచమి: ఉ. 9-12 తదుపరి షష్ఠి

ఆరుద్ర: ఉ. 7-53 తదుపరి పునర్వసు

వర్జ్యం: రా. 7-50 నుంచి 9-36 వరకు

అమృత ఘడియలు: లేవు

దుర్ముహూర్తం: ఉ. 8-08 నుంచి 8-58 వరకు తిరిగి మ.12-21 నుంచి 1-12 వరకు

రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు

సూర్యోదయం: ఉ.5.36, సూర్యాస్తమయం: సా.6.17; శ్రీ శంకర జయంతి

మేషం

ఒక మంచివార్త వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. దైవారాధన మానవద్దు.

వృషభం

సౌభాగ్యసిద్ధి ఉంది. అధికార పరిధి పెరుగుతుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. మీ మంచితనమే మీ ఎదుగుదలకు మూలం అవుతుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ధనవ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. సూర్యాష్టకం చదివితే మంచిది.

మిథునం

వృత్తి,ఉద్యోగ వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సుందరకాండ పారాయణ శుభప్రదం

కర్కాటకం

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురు కాకుండా చూసుకోవాలి. ముందుచూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి. బంధు,మిత్రులను కలుపుకొనిపోవాలి. గురుకటాక్షం రక్షిస్తుంది. శివ సందర్శనం శుభప్రదం.

సింహం

తరచూ నిర్ణయాలు మార్చడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. మాటపట్టింపులకు పోకండి. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోరాదు. శివ సందర్శనం మేలు చేస్తుంది.

కన్య

ప్రారంభించిన పనులలో చిన్న చిన్నఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బంధు,మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం.

తుల

ప్రారంభించిన పనిని పట్టుదలతో పూర్తిచేస్తారు. అప్పుల బాధ పెరగకుండా చూసుకోవాలి. విశ్రాంతి లోపిస్తుంది. తొందరపాటు చర్యలొద్దు. సుబ్రహ్మణ్య స్వామి ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.

వృశ్చికం

కుటుంబసౌఖ్యం ఉంటుంది. ప్రయత్నాల్లో లోపం లేకుండా ముందుకు సాగండి. సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అరుగుదలకు సంబంధించిన ఇబ్బందులు ఎదురవకుండా ఆహారనియమాలను పాటించండి. మనసు చెడుపనుల మీదకు మళ్లకుండా చూసుకోవాలి. చంద్ర ధ్యానం శుభప్రదం.

ధనుస్సు

ఒక శుభవార్త వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహకారం ఉంటుంది. ఆర్ధిక విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. గణపతి అష్టోత్తరం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.

మకరం

ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. కీలకమైన పనులను కొన్నాళ్ల పాటు వాయిదా వేయడమే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. గురుచరిత్ర పారాయణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

కుంభం

కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్ధికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. శనిశ్లోకం, హనుమాన్ చాలీసా చదవడం వల్ల మరిన్ని మంచి ఫలితాలను పొందగలరు.

మీనం

ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదివితే బాగుంటుంది.

ఇదీ చూడండి: ఈ వారం (మే 1-7) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.