ETV Bharat / bharat

Horoscope Today (02-05-2022): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - ఈనాడు రాశి ఫలాలు

Horoscope Today (02-05-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
ఈనాడు రాశి ఫలాలు
author img

By

Published : May 2, 2022, 5:26 AM IST

Horoscope Today(02-05-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత ఋతువు; వైశాఖమాసం; శుక్లపక్షం

విదియ: తె. 3-27 తదుపరి తదియ

కృత్తిక: రా. 11-09 తదుపరి రోహిణి

వర్జ్యం: ఉ. 10-12 నుంచి 11-55 వరకు

అమృత ఘడియలు: రా.8-34 నుంచి 10-17 వరకు

దుర్ముహూర్తం: మ.12-21 నుంచి 1-12 వరకు తిరిగి 2-53 నుంచి 3-43 వరకు

రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు

సూర్యోదయం: ఉ.5.38, సూర్యాస్తమయం: సా.6.15 చంద్రదర్శనం

మేషం

విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. సుఖసంతోషాలతో గడుపుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ప్రయోజనాలుంటాయి. దైవబలం అనుకూలిస్తోంది. శివ ఆరాధన మేలు చేస్తుంది.

వృషభం

ప్రయత్న కార్యసిద్ధి ఉంది. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. అవసరానికి తగిన ధనం అందుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. శని ధ్యాన శ్లోకం చదువుకుంటే మంచిది.

మిథునం

దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధంచేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

కర్కాటకం

చేపట్టిన కార్యాలు దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. మనోబలం పెరగానికి ఆంజనేయ ఆరాధన చేయాలి.

సింహం

చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలుచేస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. వేంకటేశ్వర స్వామి సందర్శనం శక్తినిస్తుంది.

కన్య

అనుకూల ఫలితాలున్నాయి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. ఒక ముఖ్యవ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించాలి.

తుల

మిశ్రమ ఫలితాలున్నాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయం వృథా చేయకండి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

వృశ్చికం

వృత్తి పరంగా అనుకూలత ఉంది. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభాన్నిస్తుంది.

ధనుస్సు

శుభభవిష్యత్తుకోసం చేసే ప్రత్నాలు మంచినిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో గొప్ప ఫలితాలున్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సూర్యారాధన మేలుచేస్తుంది.

మకరం

మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచలబుద్దితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. గోసేవ చేయడం మంచి ఫలితాలనిస్తుంది.

కుంభం

బంగారు భవిష్యత్తుకై వ్యూహరచన చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

మీనం

మిశ్రమ ఫలాలున్నాయి. ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తోటివారి వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. వేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది.

ఇదీ చూడండి: ఈ వారం (మే 1-7) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.